Century In 27 Balls: 27 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు.. ఆ బ్యాట్స్‌మెన్ ఎవరో తెలుసా..?
- By Gopichand Published Date - 11:34 PM, Mon - 17 June 24

Century In 27 Balls: ఈస్టోనియా బ్యాట్స్‌మెన్ సాహిల్ చౌహాన్ కలకలం సృష్టించాడు. సైప్రస్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేసి కేవలం 27 బంతుల్లోనే సెంచరీ (Century In 27 Balls) సాధించాడు. టీ20 క్రికెట్ చరిత్రలో ఓ బ్యాట్స్‌మెన్ చేసిన ఫాస్టెస్ట్ సెంచరీ ఇదే. ఈ ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, 18 సిక్సర్ల సాయంతో 144 పరుగులు చేశాడు. సాహిల్ ఇన్నింగ్స్ ఆధారంగాబ ఈస్టోనియా జట్టు కూడా 6 వికెట్ల తేడాతో గెలిచింది.
క్రిస్ గేల్ రికార్డు బద్దలైంది
సాహిల్ తుఫాను ఇన్నింగ్స్‌కు వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ రికార్డు కూడా బద్దలైంది. 2013 IPLలో క్రిస్ గేల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరపున ఆడాడు. ఆ సమయంలో పూణె వారియర్స్‌పై కేవలం 30 బంతుల్లోనే సెంచరీ స్కోర్ చేశాడు. రిషబ్ పంత్ రికార్డును కూడా సాహిల్ బద్దలు కొట్టాడు. ఢిల్లీ తరఫున ఆడుతున్న పంత్ హిమాచల్ ప్రదేశ్‌పై 32 బంతుల్లో సెంచరీ సాధించాడు. సాహిల్ తన ఇన్నింగ్స్ సమయంలో ఇద్దరి ఆటగాళ్లను తన ఆటతో వెనక్కినెట్టాడు.
Also Read: Lockie Ferguson: చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ పేసర్.. మామూలు రికార్డు కాదు ఇది..!
టీ20 ఇంటర్నేషనల్‌లోనూ ముందున్నాడు
ప్రపంచంలోని చాలా మంది శక్తివంతమైన బ్యాట్స్‌మెన్‌లను సాహిల్ వెనక్కినెట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ రికార్డు ఇంతకు ముందు నమీబియాకు చెందిన జాన్ నికోల్ లాఫ్టీ ఐటన్ పేరిట ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. కేవలం 33 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. దీని తర్వాత 34 బంతుల్లోనే సెంచరీ చేసిన నేపాల్ కుషాల్ మల్లా ఉన్నాడు. దీని తర్వాత డేవిడ్ మిల్లర్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నారు. వీరిద్దరూ 35 బంతుల్లోనే సెంచరీలు సాధించారు.
We’re now on WhatsApp : Click to Join
ఈస్టోనియా గెలిచింది
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సైప్రస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఈస్టోనియా 40 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సాహిల్ చౌహాన్ తన బ్యాటింగ్‌తో జట్టును 6 వికెట్ల తేడాతో గెలిపించాడు.