5 Lakh Runs : 5 లక్షల రన్స్.. టెస్టు క్రికెట్‌లో ఇంగ్లండ్ తిరుగులేని రికార్డు
క్రికెట్ చరిత్రలో.. ఇంగ్లండ్ టీమ్ ఆడుతున్న 1082వ టెస్ట్ మ్యాచ్ ఇది. అంటే 1082 టెస్టు మ్యాచ్‌లలో 5 లక్షల రన్స్‌ను(5 Lakh Runs) ఇంగ్లండ్ టీమ్ సాధించింది.
- By Pasha Published Date - 01:07 PM, Sat - 7 December 24

5 Lakh Runs : ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. 147 ఏళ్లుగా టెస్ట్ క్రికెట్ ఆడుతున్న ఇంగ్లండ్ టీమ్ చేసిన పరుగుల సంఖ్య తాజాగా 5 లక్షల మార్కును దాటింది. దీంతో టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక రన్స్ చేసిన ఏకైక జట్టుగా ఇంగ్లండ్ జట్టు రికార్డును సొంతం చేసుకుంది. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో ఇంగ్లండ్ రెండో టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది. క్రికెట్ చరిత్రలో.. ఇంగ్లండ్ టీమ్ ఆడుతున్న 1082వ టెస్ట్ మ్యాచ్ ఇది. అంటే 1082 టెస్టు మ్యాచ్‌లలో 5 లక్షల రన్స్‌ను(5 Lakh Runs) ఇంగ్లండ్ టీమ్ సాధించింది. ఈ టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 125 పరుగులకే ఆలౌట్ కాగా, ఇంగ్లండ్ 280 రన్స్ చేసింది. రెండోరోజు ఆట ముగిసేసరికి రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 378/5 స్కోరుతో ఉంది. దీంతో ఆ టీమ్ లీడ్ 533 రన్స్‌కు చేరింది. మూడు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్‌ను ఇంగ్లండ్ గెల్చింది. ఈ మ్యాచ్ కూడా గెలిస్తే సిరీస్ ఇంగ్లండ్ కైవసం అవుతుంది. ఇంకా మూడు రోజుల టైం మయం ఉండటంతో న్యూజిలాండ్ పరుగుల లక్ష్యం మరింత పెరగనుంది. ఒక మాటలో చెప్పాలంటే.. ఈ టెస్టు మ్యాచ్‌లో కూడా భారీ పరుగుల లక్ష్యాన్ని ఛేదించి న్యూజిలాండ్ గెలవడం కష్టమే.
Also Read :Bajaj Chetak EV : సూపర్ ఫీచర్స్, ఆకట్టుకునే లుక్‌తో బజాజ్ చేతక్.. డిసెంబరు 20న విడుదల
- టెస్టు క్రికెట్‌లో ఇంగ్లండ్ తర్వాత అత్యధిక రన్స్ చేసిన టీమ్ ఆస్ట్రేలియా. ఇప్పటివరకు టెస్ట్ మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా టీమ్ 4.28 లక్షల రన్స్ చేసింది.
- టెస్టుల్లో రన్స్ చేసే విషయంలో టీమిండియా మూడో స్థానంలో ఉంది. మన దేశ టీమ్ 2.78 లక్షల టెస్ట్ రన్స్ చేసింది.