Dwayne Bravo Net Worth: డీజే బ్రావో ఆస్థి, లగ్జరీ కార్లు, లైఫ్ స్టైల్
Dwayne Bravo Net Worth: డ్వేన్ బ్రావో అద్భుతమైన ఆల్ రౌండర్ . చాలా కాలంగా అంతర్జాతీయ మరియు లీగ్ క్రికెట్ ఆడుతున్నాడు. అతని అద్భుతమైన ప్రదర్శన ఆధారంగా బ్రావో చాలా డబ్బు సంపాదించాడు. ఒక నివేదిక ప్రకారం డ్వేన్ బ్రావో మొత్తం నికర విలువ 28 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో చూసుకుంటే 234 కోట్లు.
- Author : Praveen Aluthuru
Date : 28-09-2024 - 4:13 IST
Published By : Hashtagu Telugu Desk
Dwayne Bravo Net Worth: వెస్టిండీస్ దిగ్గజ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో అన్ని రకాల క్రికెట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 41 ఏళ్ల బ్రావో ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ మరియు ఐపీఎల్ నుండి రిటైర్ అయ్యాడు. తన రిటైర్మెంట్‌తో భవిష్యత్తులో బ్రావో ఎలాంటి పాత్ర పోషిస్తాడో కూడా తేలిపోయింది. ఈ వెటరన్ ఆల్ రౌండర్ కేకేఆర్ మెంటార్ గా ఎంపికయ్యాడు. 2022 లో ఐపీఎల్(IPL) కు వీడ్కోలు పలికిన బ్రావో గత సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించాడు. గత టీ20 ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్థాన్‌కు బౌలింగ్ కోచ్‌గా కూడా బాధ్యతలు చేపట్టాడు.
డ్వేన్ బ్రావో(Dwayne Bravo) అద్భుతమైన ఆల్ రౌండర్ . చాలా కాలంగా అంతర్జాతీయ మరియు లీగ్ క్రికెట్ ఆడుతున్నాడు. అతని అద్భుతమైన ప్రదర్శన ఆధారంగా బ్రావో చాలా డబ్బు సంపాదించాడు. ఒక నివేదిక ప్రకారం డ్వేన్ బ్రావో మొత్తం నికర విలువ 28 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో చూసుకుంటే 234 కోట్లు. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు, లీగ్ క్రికెట్ మరియు ఎండార్స్‌మెంట్ల ద్వారా బ్రావో ఈ డబ్బు సంపాదించాడు. బ్రావోకు DJ బ్రావో 47 పేరుతో తన సొంత దుస్తుల బ్రాండ్ ఉంది. దీంతో పాటు అడిడాస్, రీబాక్, శాంసంగ్ వంటి కంపెనీలకు బ్రావో బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు. ఇది కాకుండా తన మ్యూజిక్ ఆల్బమ్‌ల ద్వారా కూడా డబ్బు సంపాదిస్తాడు. అతని గ్యారేజీలో ల్యాండ్ రోవర్ డిఫెండర్, రేంజ్ రోవర్స్, జాగ్వార్ మరియు ఫోర్డ్ మస్టాంగ్ వంటి కార్లు ఉన్నాయి. స్వస్థలమైన ట్రినిడాడ్ మరియు టొబాగోతో పాటు, బ్రావోకు చాలా చోట్ల ఇల్లు, ఫామ్ హౌస్ లు, విల్లాలు ఉన్నాయి .
డ్వేన్ బ్రావో(Bravo Career) 2004 మరియు 2021 మధ్య 40 టెస్టులు, 164 వన్డేలు మరియు 91 టి20లు ఆడాడు. టెస్టులో 2200 పరుగులతో 86 వికెట్లు తీశాడు, వన్డేలో 2968 పరుగులతో 199 వికెట్లు పడగొట్టాడు. టీ20లో 1255 పరుగులతో 78 వికెట్లు తీశాడు. అయితే తమ క్రికెట్ బోర్డుతో ఆర్థిక వివాదం కారణంగా అతను చాలా కాలం పాటు జాతీయ జట్టుకు దూరంగా ఉండాల్సి వచ్చింది. టీ20ల్లో అత్యంత విజయవంతమైన బౌలర్‌గా డ్వేన్ బ్రావో రిటైరయ్యాడు. 2006 నుంచి 2024 మధ్య బ్రావో 582 మ్యాచ్‌ల్లో 631 వికెట్లు తీశాడు. ఇక ఐపీఎల్ గురించి చెప్పాలంటే 2008 నుంచి 2022 మధ్య 161 మ్యాచ్‌లు ఆడి 183 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో అతని పేరిట 1560 పరుగులు ఉన్నాయి.
Also Read: Public Vulgarity Laws: బ్రా-షార్ట్ ధరించి వీధుల్లో చక్కర్లు కొట్టిన అమ్మాయి