Australia Selector George Bailey: అందుకే జట్టులో మార్పులు చేశాం.. చీఫ్ సెలక్టర్ జార్జ్ బెయిలీ మైండ్ గేమ్
సిరీస్‌లోని చివరి రెండు టెస్టుల కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఆస్ట్రేలియా ప్రకటించింది. సెలెక్టర్లు యువ సంచలనం 19 ఏళ్ల సామ్ కాన్స్టాస్‌ను జట్టులో చేర్చారు.
- By Naresh Kumar Published Date - 12:30 PM, Sat - 21 December 24
Australia Selector George Bailey: గబ్బాలో భారత్ కంటే ఆస్ట్రేలియా జట్టు మెరుగ్గా కనిపించినా.. ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియన్ ప్లేయర్ల లోపాలు బయటపడ్డాయి. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇప్పుడు 1-1తో సమంగా ఉంది. మెల్‌బోర్న్‌లో డిసెంబర్ 26 నుండి బాక్సింగ్ డే టెస్ట్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి. ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ మినహా మిగిలిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లు గబ్బాలో ప్రత్యేకంగా సాధించిందేమీ లేదు. ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ మరియు మార్నస్ లాబుస్‌చాగ్నేలు నిరాశపరిచారు. జోష్ హేజిల్‌వుడ్ గాయం ఆ జట్టుని ఇబ్బందుల్లోకి నెట్టింది. ఇప్పుడు మెల్ బోర్న్ పోరుకు ముందు ఆస్ట్రేలియా జట్టులో పలు మార్పులు చేసి ఆ లోపాలను అధిగమించేందుకు ప్రయత్నించింది.
సిరీస్‌లోని చివరి రెండు టెస్టుల కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఆస్ట్రేలియా ప్రకటించింది. సెలెక్టర్లు యువ సంచలనం 19 ఏళ్ల సామ్ కాన్స్టాస్‌ను జట్టులో చేర్చారు. అదే సమయంలో రెడ్ బాల్ అరంగేట్ర ఆటగాడు నాథన్ మెక్‌స్వీనీని సైడ్ చేశారు. మెక్‌స్వీనీ మూడు టెస్టు మ్యాచ్‌ల్లో ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయలేకపోయాడు. ఆరు ఇన్నింగ్స్‌లలో 10, 0, 39, 10*, 9 మరియు 4 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇందులో నాలుగు సార్లు అతను జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ లో అవుటయ్యాడు.
Also Read: KTR : 24 గంటల విద్యుత్ రుజువు చేస్తే.. బీఆర్ఎస్ శాసనసభాపక్షం మొత్తం రాజీనామా చేస్తాం
తాజాగా ఆ జట్టు చీఫ్ సెలక్టర్ జార్జ్ బెయిలీ (Australia Selector George Bailey) మాట్లాడుతూ.. సామ్ తొలిసారిగా టెస్టు జట్టులోకి వచ్చాడు. అతని బ్యాటింగ్ శైలి భిన్నంగా ఉంటుంది. అయితే నాథన్‌కు సత్తా ఉందని, భవిష్యత్తులో టెస్టు క్రికెట్‌లో మరిన్ని అవకాశాలు అందుకుంటాడని మాకు నమ్మకం ఉందని తెలిపాడు. మెక్‌స్వీనీని దూరంగా ఉంచాలనే నిర్ణయం సాధారణ విషయం కాదన్నాడు. ఈ సిరీస్‌లో టాప్ ఆర్డర్ పరుగులు చేయకపోవడం ఆందోళన కలిగించింది. ఈ నేపథ్యంలో వచ్చే రెండు మ్యాచ్‌లకు బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చాల్సి వచ్చిందన్నాడు. అటు బౌలింగ్‌లో రిచర్డ్‌సన్, సీన్ అబాట్‌లకు సెలక్టర్లు అవకాశం ఇచ్చారు.