HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Dhoni School Premier League Poster Release

MSDCA : ధోనీ స్కూల్ ప్రీమియ‌ర్‌ లీగ్ పోస్ట‌ర్ ఆవిష్క‌రించిన చెన్నై సూప‌ర్ కింగ్స్ ప్లేయ‌ర్ ర‌షీద్‌

ఎంఎస్ ధోనీ క్రికెట్ అకాడ‌మీ (ఎంఎస్‌డీసీఏ) స్కూల్ ప్రీమియ‌ర్ లీగ్ సీజ‌న్‌-1 పోస్ట‌ర్‌ను చెన్నై సూప‌ర్ కింగ్స్ ప్లేయ‌ర్ షేక్ ర‌షీద్

  • Author : Prasad Date : 04-08-2023 - 7:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
MSDCA
MSDCA

ఎంఎస్ ధోనీ క్రికెట్ అకాడ‌మీ (ఎంఎస్‌డీసీఏ) స్కూల్ ప్రీమియ‌ర్ లీగ్ సీజ‌న్‌-1 పోస్ట‌ర్‌ను చెన్నై సూప‌ర్ కింగ్స్ ప్లేయ‌ర్ షేక్ ర‌షీద్ ఆవిష్క‌రించారు. శుక్ర‌వారం ఢిల్లీ ప‌బ్లిక్ స్కూల్ (నాచారం)లోని ఎంఎస్‌డీసీఏ హైపెర్ఫామెన్స్ సెంట‌ర్‌లో జ‌రిగిన స్కూల్ ప్రీమియ‌ర్ లీగ్ పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మానికి ర‌షీద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా ర‌షీద్ మాట్లాడుతూ వ‌ర్థ‌మాన క్రికెట‌ర్ల‌ను ప్రోత్స‌హించ‌డానికి అండ‌ర్‌-14 స్థాయిలో టీ20 లీగ్‌ నిర్వహించ‌డం గొప్ప విష‌య‌మ‌న్నారు. ఇలాంటి లీగ్‌ల్లో ఆడ‌డం వ‌ల్ల ప్ర‌తిభ గ‌ల క్రికెట‌ర్లు త్వ‌ర‌గా వెలుగులోకి వ‌స్తార‌ని తెలిపారు. తాను స్కూల్ క్రికెట్ ఆడుతున్న స‌మ‌యంలో ఇలాంటి ఫ్రాంచైజీ లీగ్‌లు లేవ‌ని, ఎక్క‌డ టోర్న‌మెంట్లు జ‌రుగుతున్నాయో, వెతుక్కోని ఆడేవాడిన‌ని తెలిపారు. సెలెక్ష‌న్ ట్ర‌య‌ల్స్‌లో పాల్గొని, ఈ లీగ్‌లో ఆడే అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ర‌షీద్ కోరారు. అనేక క‌ష్టాల‌ను ఎదుర్కొని, ఒక పేద కుటుంబం నుంచి పైకొచ్చిన ర‌షీద్‌ను ప్ర‌తి ఒక్క‌రు ఆద‌ర్శంగా తీసుకోవాల‌ని ప‌ల్ల‌వి విద్యాసంస్థ‌ల సీఓఓ య‌శ‌స్వి తెలిపారు. ర‌షీద్‌నిప్రేర‌ణ‌గా తీసుకొని, క్రికెట్‌లోనే కాకుండా విద్యార్థులు తాము ఎంచుకున్న రంగాల్లో క‌ష్ట‌ప‌డి రాణించాల‌ని సూచించారు. 2022 అండ‌ర్‌-19 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో రాణించి, త‌న స‌త్తా నిరూపించుకున్న ర‌షీద్‌, భ‌విష్య‌త్‌లో టీమిండియాకు ప్రాతినిథ్యం వ‌హించ‌డంతో పాటు మ‌రింత ఉన్న‌త శిఖ‌రాల‌ను అధిరోహించాల‌ని యశ‌స్వి ఆకాంక్షించారు. ఆస‌క్తి గ‌ల క్రీడాకారులు లీగ్‌లో ఆడేందుకు ఈ నెంబ‌ర్ల‌కు 7396386214, 7618703508 ఫోన్ చేసి త‌మ పేర్ల‌ను న‌మోదు చేసుకోవ‌చ్చని తెలిపారు. హైద‌రాబాద్‌లోని ఎంఎస్‌డీసీఏ కేంద్రాల్లో ఈనెల 20వ తేదీన సెలెక్ష‌న్స్‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎంఎస్‌డీసీఏ తెలంగాణ భాగ‌స్వామి బ్రైనాక్స్ బీ డైరెక్టెర్‌ ర‌షీద్ బాషా, 7హెచ్ స్పోర్ట్స్ డైరెక్టెర్ బి.వెంక‌టేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hyderabad
  • ms dhoni
  • MSDCA
  • Pallavi schools
  • telangana

Related News

kurchi-thatha-dies-of-heart-attack

Kurchi Thatha: గుండెపోటుతో కుర్చీ తాత మృతి

“ఆ కుర్చీని మడత పెట్టి’ అంటూ సోషల్ మీడియాలో ఫేమస్‌‌‌గా మారిన కుర్చీ తాత అలియాస్ మహ్మద్ పాషా మృతి చెందారు. హైదరాబాద్‌లోని కృష్ణకాంత్‌ పార్కులో మంగళవారం సాయంత్రం వాకింగ్‌ చేస్తున్న సమయంలో ఎండ దెబ్బకు ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. పార్క్‌కు వచ్చిన కొంతమంది గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు పాషాను తీసుకెళ్లి ప్రథమ చికిత్స అందించి ఇంటికి తీసుకెళ్లారు.

  • Condom packet in a beer bottle

    Condom Packet: బీరు సీసాలో కండోమ్ ప్యాకెట్

  • Dhoni Takes Key Decision on Retirement

    Chennai Super Kings: రిటైర్మెంట్‌పై ధోనీ కీలక నిర్ణయం

  • Union Minister Bandi Sanjay's mother falls critically ill.

    Bandi Sanjay: కేంద్ర మంత్రి బండి సంజయ్ తల్లికి తీవ్ర అస్వస్థత

Latest News

  • Atchannaidu: జగన్ పై అచ్చెన్నాయుడు ఫైర్

  • Prakash Raj: కాక్‌రోచ్ జనతా పార్టీలోకి ప్రకాశ్ రాజ్.. మోదీపై సెటైర్.. వీడియో వైరల్!

  • Kamal Haasan: ప్రధాని మోదీకి కమల్ హాసన్ మద్దతు

  • APSFTVTDC: ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నూతన కమిటీ నియామకం..

  • APPSC: ఏపీపీఎస్సీ ద్వారా ఈవో పోస్టుల భర్తీ: దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

Trending News

    • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

    • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

    • Beer Price Drop: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..రూ.185 బీర్ ధర రూ.110 కి..70 రూ .ల తగ్గింపు

    • Rahul Gandhi: దేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతోంది : రాహుల్‌ గాంధీ

    • UAE: భారత్‌తో యూఏఈ కీలక ఒప్పందాలు.. ఇంధన రంగంలో భారీ డీల్స్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd