HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Delhi Capitals Appoint Jemimah Rodrigues As Captain

ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్‌గా జెమీమా రోడ్రిగ్స్!

25 ఏళ్ల జెమీమా రోడ్రిగ్స్ భారత జట్టు 2025 ప్రపంచకప్ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్‌లో ఆమె ఆడిన 127 పరుగుల చారిత్రాత్మక ఇన్నింగ్స్ హైలైట్‌గా నిలిచింది.

  • Author : Gopi Date : 23-12-2025 - 8:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jemimah Rodrigues
Jemimah Rodrigues

Jemimah Rodrigues: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌కు సంబంధించి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. భారత స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్‌ను తమ కొత్త కెప్టెన్‌గా నియమించింది. మెగ్ లానింగ్ వారసురాలిగా జెమీమా ఆస్ట్రేలియా దిగ్గజం మెగ్ లానింగ్ స్థానంలో జెమీమా రోడ్రిగ్స్ బాధ్యతలు చేపట్టనున్నారు. లానింగ్ నాయకత్వంలో ఢిల్లీ క్యాపిటల్స్ గత మూడు సీజన్లలోనూ ఫైనల్‌కు చేరినప్పటికీ ఒక్కసారి కూడా టైటిల్‌ను గెలవలేకపోయింది. ఈ నేపథ్యంలో జట్టు యాజమాన్యం నాయకత్వ మార్పుకు శ్రీకారం చుట్టింది.

ఢిల్లీ జట్టులో జెమీమా ప్రస్థానం

WPL మొదటి సీజన్ నుండి జెమీమా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోనే ఉన్నారు. ఇప్పటివరకు 27 మ్యాచ్‌ల్లో 139.67 స్ట్రైక్ రేట్‌తో 507 పరుగులు చేశారు. ఢిల్లీ ఆడిన మూడు ఫైనల్ మ్యాచ్‌లలోనూ ఆమె సభ్యురాలిగా ఉన్నారు.

వరల్డ్ కప్ హీరో.. భారీ ధరతో రిటెన్షన్

25 ఏళ్ల జెమీమా రోడ్రిగ్స్ భారత జట్టు 2025 ప్రపంచకప్ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్‌లో ఆమె ఆడిన 127 పరుగుల చారిత్రాత్మక ఇన్నింగ్స్ హైలైట్‌గా నిలిచింది. ఈ ప్రతిభను గుర్తించిన ఢిల్లీ క్యాపిటల్స్, WPL 2026 మెగా వేలానికి ముందే ఆమెను రూ. 2.2 కోట్లకు రిటెన్షన్ చేసుకుంది.

కెప్టెన్సీపై జెమీమా స్పందన

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా నియమితులవ్వడం గౌరవంగా భావిస్తున్నాను. నాపై నమ్మకం ఉంచిన టీమ్ మేనేజ్‌మెంట్, సపోర్ట్ స్టాఫ్‌కు కృతజ్ఞతలు. ఈ ఏడాది మా కుటుంబానికి చాలా బాగుంది. మొదట వరల్డ్ కప్ గెలవడం, ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ రావడం చాలా ఆనందంగా ఉందని ఆమె పేర్కొన్నారు.

Also Read: ప్రవైట్ హాస్పటల్ ICU ఛార్జీల బాదుడు పై కేంద్రం ఆగ్రహం

She never lost faith, she never feared and she’s just getting started 💙❤️ pic.twitter.com/UPCuHKbPEs

— Delhi Capitals (@DelhiCapitals) December 23, 2025

అపారమైన అనుభవం

కేవలం 25 ఏళ్ల వయసులోనే జెమీమా టీ20ల్లో గొప్ప అనుభవాన్ని సంపాదించారు. టీ20 ఇంటర్నేషనల్స్‌లో మొత్తం 113 మ్యాచ్‌ల్లో 14 అర్ధ సెంచరీలతో 2,444 పరుగులు సాధించింది. 59 వ‌న్డే మ్యాచ్‌ల్లో 1,749 పరుగులు చేసింది.

తొలి మ్యాచ్ ఎప్పుడు?

WPL 2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తన తొలి మ్యాచ్‌ను జనవరి 10న ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది. కొత్త కెప్టెన్ నాయకత్వంలో ఢిల్లీ ఈసారి ఎలా రాణిస్తుందో చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Delhi Capital Captain
  • delhi capitals
  • Jemimah Rodrigues
  • Women’s Premier League
  • WPL 2026

Related News

IPL 2026 Points Table

ఐపీఎల్ 2026.. టాప్ ప్లేస్‌లో ఉన్న జ‌ట్టు ఏదీ?

ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ జట్టు ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు ఓటమి లేకుండా దూసుకుపోతోంది.

  • Hyderabad vs Delhi

    నేడు ర‌స‌వ‌త్త‌ర పోరు.. స‌న్‌రైజ‌ర్స్ విజ‌యాల‌కు ఢిల్లీ బ్రేక్ వేయ‌గ‌ల‌దా?

Latest News

  • అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం.. యుద్ధం త‌ప్ప‌దా?

  • ఫాస్టాగ్ వాడుతున్నారా? అయితే ఈ వార్నింగ్ మీకోస‌మే!

  • కొత్త సిలిండర్ బుకింగ్ రూల్స్.. మే 1 నుండి మారనున్న నిబంధనలు?

  • ట్రంప్ కార్యక్రమంపై కాల్పుల ఘటన.. స్పందించిన ప్రధాని మోదీ

  • వైభవ్‌ సూర్యవంశీ ఖాతాలో రికార్డులే రికార్డులు!

Trending News

    • ఐపీఎల్ 2026.. ఒకే రోజు 986 ప‌రుగులు!!

    • దాడి త‌ర్వాత మాట్లాడిన ట్రంప్‌.. ఇరాన్‌పై అనుమానాలు?

    • ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం!

    • ఫిఫా వరల్డ్ కప్ 2026.. ఇరాన్ స్థానంలో ఇటలీ?

    • ‘పెద్ది’లో శృతి హాసన్ సందడి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd