Siddharth Apologies : సైనాకు సిద్దార్ధ్ క్షమాపణలు
భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ సైనానెహ్వాల్ ను ఉద్ధేశించి తాను చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగడంతో నటుడు సిద్దార్థ్ క్షమాపణలు చెప్పారు. తాను జోక్ చేసే ఉద్ధేశంతోనేనని అలా మాట్లాడానని, ఎవరినీ నొప్పించే ఉద్ధేశం లేదన్నారు.
- By Hashtag U Published Date - 11:28 AM, Wed - 12 January 22

భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ సైనానెహ్వాల్ ను ఉద్ధేశించి తాను చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగడంతో నటుడు సిద్దార్థ్ క్షమాపణలు చెప్పారు. తాను జోక్ చేసే ఉద్ధేశంతోనేనని అలా మాట్లాడానని, ఎవరినీ నొప్పించే ఉద్ధేశం లేదన్నారు. కొందరు ఈ ట్వీట్ ద్వారా బాధపడుతున్నట్టు తెలిసి క్షమాపణలు చెబుతున్నట్టు ఒక లేఖను సిద్ధార్ధ్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
https://twitter.com/Actor_Siddharth/status/1480962679032324097
టీవల ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా భద్రతా వైఫల్యంపై సైనా నెహ్వాల్ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. దేశ ప్రధానికే భద్రత లేకపోతే ఇక దేశానికి భద్రత ఉంటుందని ఎలా భావించగలమంటూ ప్రశ్నించారు. సైనా ట్వీట్‌పై వ్యంగ్యంగా స్పందించిన సిద్దార్థ్..అభ్యంతరకరమైన పదం వాడుతూ ట్వీట్ చేశారు. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఇది మహిళా లోకాన్ని అవమానించడమేనన్న విమర్శలు వెల్లువెత్తాయి. జాతీయ మహిళా కమిషన్ సైతం సిద్దార్థ్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సిద్ధార్ధ్ క్షమాపణలు చెప్పక తప్పలేదు.
” కొద్దిరోజుల క్రితం మీ ట్వీట్‌పై స్పందిస్తూ నేను వేసిన రూడ్ జోక్‌కి క్షమాణలు చెప్పాలనుకుంటున్నాను. నేను చాలా విషయాల్లో మీతో ఏకీభవించకపోవచ్చు. మీ ట్వీట్‌ని చదివినప్పుడు నిరాశతో లేదా కోపంతో నేను ఉపయోగించిన పదాలు, నా స్వరాన్ని సమర్థించుకోలేను. ఒక జోక్‌కి మనం వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే.. అది మంచి జోక్ కాదనే అర్థం. అలాంటి జోక్‌ను వాడినందుకు క్షమాపణలు. నువ్వు ఎప్పటికీ మా ఛాంపియన్ వే అని సిద్దార్థ్ చెప్పుకొచ్చారు. ఒక గొప్ప క్రీడాకారిణిగా సైనా అంటే తనకు ఎంతో గౌరవమని లేఖలో పేర్కొన్నారు. కాగా సిద్ధార్ధ్ ట్వీట్ స్పందించిన సైనా కొంచెం మంచి పదాలు ఉపయోగించి ఉంటే బావుండేదని వ్యాఖ్యానించింది.