David Warner: ఆసీస్ కు దెబ్బ మీద దెబ్బ.. వార్నర్ ఔట్
భారత్ తో టెస్ట్ సీరీస్ లో వరుసగా రెండు మ్యాచ్ లు ఓడి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోల్పోయిన
- Author : Maheswara Rao Nadella
Date : 21-02-2023 - 5:35 IST
Published By : Hashtagu Telugu Desk
భారత్ తో టెస్ట్ సీరీస్ లో వరుసగా రెండు మ్యాచ్ లు ఓడి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోల్పోయిన ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. ఇప్పటికే గాయంతో కెప్టెన్ పాట్ కమ్మిన్స్ తో పలువురు ప్లేయర్స్ దూరమవగా.. తాజాగా ఆ జాబితాలోకి మరో స్టార్ ఆటగాడు చేరాడు. ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (David Warner) గాయంతో సీరీస్ మొత్తానికీ దూరమయ్యాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో వార్నర్ కంకషన్‌కు గురయ్యాడు. ఆ తర్వాత అతడి ఎడమ చేతికి బంతి బలంగా తాకింది. అయినా, బ్యాటింగ్ కొసాగించిన వార్నర్ 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో వార్నర్ స్థానంలో రెన్‌షా కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చాడు. గాయం నుంచీ కోలుకునేందుకు సమయం పడుతుందనీ తెలుస్తోంది. దీంతో వార్నర్ టెస్ట్ సిరీస్ నుంచి వైదొలుగుతున్నాడని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. మార్చి 17 నుంచి భారత్‌తో ప్రారంభంకానున్న మూడు వన్డేల సిరీస్‌కు వార్నర్ (David Warner) అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఈ సీరీస్ లో అతడు పెద్దగా రాణించింది లేదు.మొదటి రెండు టెస్టుల్లో మూడు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 26 పరుగులే చేశాడు.
కాగా ఈ సీరీస్ ఆరంభం నుంచీ కంగారూలని గాయాలు వెంటాడుతున్నాయి. టూర్ మొదలవడానికి ముందే స్టార్క్ గాయపడ్డాడు. అలాగే కెప్టెన్ పాట్ కమ్మిన్స్ కూడా గాయంతో స్వదేశానికి తిరిగి వెళ్ళిపోయాడు. అతి మిగిలిన రెండు టెస్టులకు ఆసీస్ స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ కూడా దూరమయ్యాడు. ఇదిలా ఉంటే ఇండోర్ వేదికగా మార్చి 1 నుంచి మూడో టెస్టు, అహ్మదాబాద్ వేదికగా మార్చి 9 నుంచి నాలుగో టెస్టు జరుగనున్నాయి. స్పినర్ల జోరుతో భారత్ ఇప్పటికే తొలి రెండు టెస్టుల్లోనూ ఆసీస్ ను.చిత్తు చేసింది.
Also Read: Best Fish for Weight Loss: బరువు తగ్గడానికి ఏ చేప మంచిది?