Telugu News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat

  • Telugu News
  • ⁄Sports News
  • ⁄Daryl Mitchells Six Hits Spectators Beer Glass Nz Team Provide Replacement Drink

Cricket Drink: మిచెల్ షాట్ కు బద్దలయిన బీరు గ్లాస్

ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌ తొలి రోజు ఆటలో ఓ విచిత్రమైన ఘటన జరిగింది.

  • By Naresh Kumar Published Date - 10:19 AM, Sun - 12 June 22
Cricket Drink: మిచెల్ షాట్ కు బద్దలయిన  బీరు గ్లాస్

ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌ తొలి రోజు ఆటలో ఓ విచిత్రమైన ఘటన జరిగింది. టాప్‌ ఫామ్‌లో ఉన్న న్యూజిలాండ్‌ బ్యాటర్‌ డారిల్‌ మిచెల్‌ కొట్టిన ఓ సిక్స్‌.. స్టాండ్స్‌లో కూర్చొని మ్యాచ్‌ చూస్తున్న ఓ అభిమాని బీర్‌ గ్లాస్‌లో పడింది. 56వ ఓవర్లో ఈ ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. జాక్‌ లీచ్‌ బౌలింగ్‌లో కాస్త ముందుకు వచ్చి ఆడని మిచెల్‌.. నేరుగా సిక్స్‌ బాదాడు. అది కాస్తా బుల్లెట్‌ వేగంతో వెళ్లింది. దానిని క్యాచ్‌ పట్టుకోవడానికి కూడా స్టాండ్స్‌లో ఎవరూ ట్రై చేయలేదు. దీంతో నేరుగా ఓ మహిళా అభిమాని పట్టుకున్న బీర్‌ గ్లాస్‌లో పడింది. దీంతో బీర్‌ మొత్తం ఒలికిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసి ప్లేయర్స్‌, ఫ్యాన్స్‌, చివరికి కామెంటేటర్లు కూడా నవ్వు ఆపుకోలేకపోయారు.
ఈ షాట్‌ను స్లోమోషన్‌లో చూసినప్పుడు బాల్‌ బీర్‌ గ్లాస్‌లో పడటం స్పష్టంగా కనిపించింది. ఆ సమయంలో బౌండరీ దగ్గరే ఉన్న ఇంగ్లండ్‌ ఫీల్డర్‌ మాథ్యూ పాట్స్‌.. స్టాండ్స్‌లో ఏం జరిగిందో తమ ప్లేయర్స్‌కు చెప్పాడు. అయితే ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. తమ బ్యాటర్‌ వల్ల ఆ అభిమాని బీర్‌ ఒలికిపోయింది కాబట్టి.. ఆమెకు న్యూజిలాండ్‌ టీమ్‌ కొత్త బీర్‌ కొనిచ్చింది. ఈ విషయాన్ని ఇంగ్లండ్‌ బార్మీ ఆర్మీ సపోర్ట్స్‌ క్లబ్‌ ట్విటర్‌ ద్వారా చెప్పింది.

What a shot from Daryl Mitchell – hopefully he'll get the guy another pint…#ENGvsNZ pic.twitter.com/uDm7cu3RrN

— Ian McDougall (@IanMcDougall1) June 10, 2022

Tags  

  • Daryl Mitchell's six
  • new zealand vs england
  • replacement drink
  • spectator's beer glass; NZ team

Related News

    Latest News

    • Oil rates: వారంలో తగ్గనున్న వంటనూనె ధర…!!

    • Oldest Air Hostess: 65 ఏళ్లుగా ఒకే రూట్ లో పని చేస్తున్న ఎయిర్ హాస్టస్.. ఆమె వివరాలివే!

    • Life Expectancy Report : ఎక్కువ కాలం జీవించేది ఎవరు…భారతీయులా..? చైనీయులా?

    • Militants Surrender : కరుడుగట్టిన ఉగ్రవాదుల మనస్సు మార్చిన తల్లిప్రేమ..!!

    • 1st T20I Preview: టీ ట్వంటీ ఫైట్‌కు భారత్, ఇంగ్లాండ్ రెడీ

    Trending

      • Zomato Bill: ఫుడ్ డెలివరీ మోసం.. వామ్మో ఒకేసారి ఇంత దోచేస్తున్నారా?

      • OTP విషయంలో గొడవ.. ప్యాసింజర్‌ను చంపిన ట్యాక్సీ డ్రైవర్!

      • Swiggy: డెలివరీ బాయ్ కోసం స్విగ్గీ స్వారీ!

      • Air India Alert : ఎయిర్ ఇండియా పేరుపై ఆఫర్.. అది ఫేక్ అంటూ మహారాజా క్లారిటీ!

      • Service Charge In Hotels : హోట‌ల్స్, రెస్టారెంట్లపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ 1915

    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    • Copyright © 2022 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam
    • Follow us on: