CSK vs SRH: 12 ఏళ్ల తర్వాత చెన్నైని చెపాక్‌లో చిత్తు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్!
సన్‌రైజర్స్ హైదరాబాద్ .. చెన్నై సూపర్ కింగ్స్ ను 5 వికెట్ల తేడాతో ఓడించి తమ ప్లేఆఫ్ అవకాశాలను బలోపేతం చేసుకుంది. ఈ ఓటమితో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్ అర్హత సాధించే మార్గం మరింత కష్టతరమైంది.
- By Gopichand Published Date - 11:34 PM, Fri - 25 April 25

CSK vs SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్ (CSK vs SRH).. చెన్నై సూపర్ కింగ్స్ ను 5 వికెట్ల తేడాతో ఓడించి తమ ప్లేఆఫ్ అవకాశాలను బలోపేతం చేసుకుంది. ఈ ఓటమితో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్ అర్హత సాధించే మార్గం మరింత కష్టతరమైంది. హైదరాబాద్ 8 బంతులు మిగిలి ఉండగానే ఈ మ్యాచ్‌ను గెలుచుకుంది. ఐపీఎల్ చరిత్రలో మొదటిసారిగా SRH చెపాక్ మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించడం గమనార్హం.
SRHకు 155 పరుగుల లక్ష్యం
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు 155 పరుగుల లక్ష్యం లభించింది. మొదటి ఓవర్ రెండో బంతికే ఖలీల్ అహ్మద్ అభిషేక్ శర్మను డకౌట్ చేశాడు. సాధారణంగా మైదానంలో ఉత్సాహాన్ని నింపే ట్రావిస్ హెడ్ ఈసారి 16 బంతుల్లో కేవలం 19 పరుగులు మాత్రమే చేశాడు. హైదరాబాద్ జట్టు ఇబ్బందులు పెరుగుతున్నాయి. ఎందుకంటే హెన్రిక్ క్లాసెన్ కూడా 7 పరుగులకే పెవిలియన్‌కు చేరాడు. ఈ విధంగా SRH 54 పరుగుల వద్ద 3 కీలక వికెట్లను కోల్పోయింది.
ఇషాన్ కిషన్, అనికేత్ వర్మల 36 పరుగుల భాగస్వామ్యం SRH జట్టు విజయ ఆశలకు ఊపిరి పోసింది. కానీ కిషన్ 44 పరుగుల వద్ద ఔట్ కావడంతో ఆ ఆశలకు గండిపడింది. అతను ఔట్ అయ్యే సమయంలో SRHకు విజయం కోసం 8 ఓవర్లలో 65 పరుగులు అవసరం. అనికేత్ కూడా స్థిరమైన ఆటను ఆడాడు. కానీ కీలక సమయంలో 19 పరుగుల వద్ద తన వికెట్‌ను కోల్పోయాడు.
కామిందు మెండిస్ ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొదట అతను ఫీల్డింగ్ సమయంలో డెవాల్డ్ బ్రెవిస్‌ను అద్భుతమైన క్యాచ్ ద్వారా ఔట్ చేశాడు. బ్రెవిస్ 42 పరుగులతో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. బ్రెవిస్ వేగవంతమైన ఇన్నింగ్స్‌తో చెన్నైని గౌరవప్రదమైన స్కోరుకు చేర్చాడు.
మెండిస్ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఆ సమయంలో అతని జట్టుకు 8 ఓవర్లలో విజయం కోసం 65 పరుగులు అవసరం. మెండిస్ ఒక వైపు నిలకడగా ఆడుతూ 22 బంతుల్లో 32 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతను ఆరో వికెట్‌కు నితీష్ కుమార్ రెడ్డితో కలిసి 49 పరుగుల నాటౌట్ భాగస్వామ్యాన్ని నెలకొల్పి SRH విజయాన్ని ఖరారు చేశాడు.