IPL : సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి ఉప్పల్ స్టేడియం లో వెంకటేష్ సందడి
సీఎం రేవంత్ సైతం తన బిజీ షెడ్యూల్ ను పక్కన పెట్టి మ్యాచ్ చూసేందుకు రావడం..అది కూడా కుటుంబ సభ్యులతో కలిసి రావడం విశేషం.
- Author : Sudheer
Date : 05-04-2024 - 9:41 IST
Published By : Hashtagu Telugu Desk
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తో కలిసి ఉప్పల్ స్టేడియం లో హీరో వెంకటేష్ (Venkatesh) సందడి చేసారు. సీఎం రేవంత్ పక్కన కూర్చొని మ్యాచ్ ను తిలకిస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేసారు. దీని తాలూకా పిక్స్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. శుక్రవారం ఉప్పల్ (Uppal) స్టేడియంలో హైదరాబాద్ – చెన్నై (Sunrisers Hyderabad vs Chennai Super Kings) మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుంది. గత మ్యాచ్ లో హైదరాబాద్ టీం పరుగుల వరద సృష్టించడం తో..ఈరోజు జరుగుతున్న మ్యాచ్ ఫై అందరిలో ఆసక్తి నెలకుంది. సీఎం రేవంత్ సైతం తన బిజీ షెడ్యూల్ ను పక్కన పెట్టి మ్యాచ్ చూసేందుకు రావడం..అది కూడా కుటుంబ సభ్యులతో కలిసి రావడం విశేషం. వీరు మాత్రమే కాదు టాలీవుడ్ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తదితరులు సైతం మ్యాచ్ ను వీక్షిస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ బౌలర్లు రెచ్చిపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది చెన్నై . హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్, ప్యాట్ కమిన్స్, నటరాజన్, షాబాజ్ అహ్మద్, జైదేవ్ ఉనద్కత్ తలా ఒక వికెట్ పడగొట్టారు. ముందుగా టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ సీజన్‌లో ఇరు జట్లకు ఇది నాలుగో మ్యాచ్. హైదరాబాద్ రెండు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసి, ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. చెన్నై రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, చివరి మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో ఓడిపోయింది.
Read Also : Pushpa 2 : కౌంట్ డౌన్ పోస్టర్ తో పూనకాలు స్టార్ట్ చేసిన పుష్ప టీం