Clear No Ball: సాయి సుదర్శన్ వికెట్ వివాదం.. బ్యాడ్ అంపైరింగ్
నిన్న ఆదివారం పాకిస్థాన్ ఏ జట్టు, ఇండియా ఏ జట్టు మధ్య జరిగిన ఎమర్జింగ్ ఆసియా కప్ ఫైనల్ లో భారత్ పై పాక్ విజయం సాధించింది.
- By Praveen Aluthuru Published Date - 07:54 AM, Mon - 24 July 23

Clear No Ball: నిన్న ఆదివారం పాకిస్థాన్ ఏ జట్టు, ఇండియా ఏ జట్టు మధ్య జరిగిన ఎమర్జింగ్ ఆసియా కప్ ఫైనల్ లో భారత్ పై పాక్ విజయం సాధించింది. అయితే ఈ కీలక మ్యాచ్ లో సాయి సుదర్శన్ వికెట్‌పై రచ్చ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ A జట్టు 352 పరుగులు చేసి భారత్‌కు 353 పరుగుల విజయ లక్ష్యాన్ని అందించింది. అయితే బరిలోకి దిగిన భారత్-ఎ జట్టు అద్భుతంగా ప్రారంభించింది. కానీ 9వ ఓవర్‌లో అర్షద్ ఇక్బాల్ వేసిన బంతితో సాయి సుదర్శన్ ఔటయ్యాడు. వికెట్ కీపర్ మహ్మద్ హారిస్ క్యాచ్ పట్టడంతో సుదర్శన్ పెవిలియన్ చేరాల్సి వచ్చింది. ఇక్కడే వివాదం రాజేసుకుంది. నిజానికి ఇక్బాల్ బంతి వేసేటప్పుడు కాలు లైన్ ని క్రాస్ చేశాడు. అయితే బంగ్లాదేశ్ అంపైర్ నో బాల్ గా పరిగణించలేదు. దీంతో సుదర్శన్ పెవిలియన్ చేరాడు. దీంతో సోషల్ మీడియాలో అంపైరింగ్‌పై అభిమానులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అంపైర్ తీర్పుపై మండిపడుతున్నారు.
https://twitter.com/chikku45chiku/status/1683109785418498048?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1683109785418498048%7Ctwgr%5E63d3fd28848866588f9d7344709a1be764230ce8%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.jagran.com%2Fcricket%2Fheadlines-ind-a-vs-pak-a-sai-sudharsan-controversial-wicket-fans-trolled-umpire-for-wrong-decision-saying-this-is-clear-no-ball-23480208.html
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ విషయంలో ఇదే జరిగింది.బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల ODI సిరీస్ 1-1తో సమమైంది. మూడవ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ వికెట్ విషయంలో బ్యాడ్ అంపైరింగ్ వివాదం నెలకొంది.
Also Read: Terror Attacks: పాకిస్థాన్ లో పెరుగుతున్న తీవ్రవాద ఘటనలు.. ఏడాది కాలంలోనే 665 ఉగ్రవాద దాడులు..!