World Cup 2023: ప్రపంచకప్‌లో టీమిండియాకి ఆ ఇద్దరు ప్లేయర్స్ కీలకం
ఐసీసీ ప్రపంచకప్ కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఉత్కంఠ పెరుగుతుంది. ఈ సారి రోహిత్ నాయకత్వంలో టీమ్ ఇండియా ప్రపంచకప్ కు వెళ్లనుంది.
- Author : Praveen Aluthuru
Date : 01-07-2023 - 12:18 IST
Published By : Hashtagu Telugu Desk
World Cup 2023: ఐసీసీ ప్రపంచకప్ కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఉత్కంఠ పెరుగుతుంది. ఈ సారి రోహిత్ నాయకత్వంలో టీమ్ ఇండియా ప్రపంచకప్ కు వెళ్లనుంది. 12 ఏళ్ల తర్వాత భారత గడ్డపై జరగనున్న ప్రపంచకప్ షెడ్యూల్‌ను కూడా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది. విరాట్ కోహ్లీ మరియు కెప్టెన్ రోహిత్ శర్మ వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లపై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ టీం ఇండియాలో ఆ ఇద్దరు ప్లేయర్స్ ఏ కీలకమట. ప్రపంచకప్‌లో జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ భారత జట్టుకు బలమైన ఆటగాళ్లుగా పేర్కొన్నాడు యూనివర్స్ బాస్ క్రిస్ గేల్.
జస్ప్రీత్ బుమ్రా మరియు సూర్యకుమార్ యాదవ్ ప్రపంచ కప్‌లో భారత జట్టుకు అత్యంత ముఖ్యమైన ఆటగాళ్లుగా నిరూపిస్తారని చెప్పాడు కరేబియన్ డేంజరస్ ఆటగాడు గేల్. బుమ్రా మరియు సూర్యకుమార్ భారత్‌కు కీలక ఆటగాళ్లు అవుతారని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది ప్రజలు ఎదురు చూసే ప్రపంచ కప్ అక్టోబర్ 5న ప్రారంభం కానుంది.

టీం ఇండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గత ఏడాది గాయపడ్డాడు. బుమ్రా కొన్ని నెలలుగా జట్టుకు దూరమయ్యాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ప్రస్తుతానికి బుమ్రా కోలుకుంటున్నట్టు బీసీసీఐ ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంది. బుమ్రా గత ఏడాది ఆస్ట్రేలియాతో తన చివరి మ్యాచ్ ఆడాడు. ప్రస్తుతం బుమ్రా NCAలో ఉన్నాడు. కాగా బుమ్రా ఐర్లాండ్‌తో జరిగే T20 సిరీస్‌తో పునరాగమనం చేయనున్నాడని బీసీసీఐ వర్గాలు భావిస్తున్నాయి.
Read More: India Jersey Logo: ఇండియా జెర్సీపై లోగో మార్పు.. ఇకపై డ్రీమ్ 11 లోగో