HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Ceo Involved In Team Selection Kkr Captain Shreyas Remark Raises Questions

Shreyas Iyer Shocking Remarks: మా టీమ్ ఎంపికలో సీఈవో పాత్ర.. కేకేఆర్ కెప్టెన్ వ్యాఖ్యలపై దుమారం!!

ముంబైతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో అద్బుతంగా పోరాడిన కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్‌) విజయం సొంతం చేసుకుంది.

  • By Hashtag U Published Date - 04:21 PM, Tue - 10 May 22
  • daily-hunt
Shreyas Iyer
Shreyas Iyer

ముంబైతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో అద్బుతంగా పోరాడిన కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్‌) విజయం సొంతం చేసుకుంది. 52 పరుగులతో సూపర్ విక్టరీ నమోదు చేసి, ఐపీఎల్ లో ప్లే ఆఫ్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్ లో ఓడితే ప్లే ఆఫ్‌ అవకాశాలు గల్లంతయ్యే ప్రమాదం ఉన్న సమయంలో కేకేఆర్‌ పుంజుకుని కీలక విజయాన్ని అందుకుంది. మ్యాచ్ గెలిచిన అనంతరం కేకేఆర్‌ కెప్టెన్‌ శ్రేయస్ అయ్యర్‌ మాట్లాడుతూ.. ” కీలక సమయంలో విజయం సాధించడం కాస్త ఊపిరినిచ్చింది. వరుసగా ఐదు పరాజయాలు మమ్మల్ని బాగా కుంగదీశాయి. తుది జట్టు ఎంపిక పెద్ద తలనొప్పిగా మారిపోయింది. ఈ మ్యాచ్‌ ఆడడం లేదంటూ ఆటగాళ్లకు స్వయంగా చెప్పడం బాధ కలిగించేది. కొన్నిసార్లు తుది జట్టు ఎంపికలో జట్టు సీఈవో వెంకీ మైసూర్‌ కూడా ఇన్వాల్వ్‌ అయ్యాడు. జట్టు ఎంపికలో అతనిచ్చిన సలహాలు కూడా మాకు ఉపయోగపడ్డాయి’ అని తెలిపారు. ఈనేపథ్యంలో క్రికెట్ పై పూర్తి అవగాహన లేని సీఈవో సలహాలతో జట్టులో క్రీడాకారులను ఎంపిక చేశారా ? అంటూ వాడివేడి చర్చ మొదలైంది. దీనివల్ల కేకేఆర్ టీమ్ కెప్టెన్, కోచ్ ల పరిధికి విఘాతం కలుగుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సీజన్‌ ఆరంభంలో మొదటి నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో శ్రేయస్‌ అయ్యర్‌ సేన బలంగా కనిపించింది. కానీ ఆ తర్వాతే పరిస్థితి పూర్తిగా రివర్స్‌ అయింది. సీఈవో వెంకీ మైసూర్‌ సలహాలను కెప్టెన్, కోచ్ వినడం వల్లే జట్టు ఎంపికలో లోపాలు జరిగాయని, బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఎవరు రావాలనే దానిపై స్పష్టత లేకుండా పోయిందని అంటున్నారు. సీఈవో సూచనల్లో భాగంగానే జట్టు సమతుల్యత దెబ్బతినేలా ప్రయోగాలు చేసి, ఐదు వరుస పరాజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి కేకేఆర్ పడిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సీజన్‌లో 10 మ్యాచ్‌లు ముగిసేసరికి మూడు విజయాలు.. ఏడు ఓటములతో కేకేఆర్‌ ప్లే ఆఫ్‌ రేసు నుంచి నిష్క్రమించినట్లే కనిపించింది. తాజాగా ముంబైతో జరిగిన మ్యాచ్ లో గెలవడంతో కేకేఆర్‌ జట్టుకు మళ్లీ ఆశలు రేకెత్తాయి. ‘ ప్రస్తుతం జట్టుపై ఒక కూర్పు వచ్చింది. ఇకపై మార్పులు ఉండకపోవచ్చు’ అని కేకేఆర్‌ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ చేసిన కామెంట్స్ కొంటు ఆశాజనకంగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • IPL 2022
  • KKR
  • KKR CEO
  • shreyas iyer
  • team selection

Related News

    Latest News

    • Romance : కాలేజీలో బరితెగించిన స్టూడెంట్స్..ముద్దుల్లో మునిగి ఆపై !!

    • Ande Sri Passes Away : అందెశ్రీ మరణానికి కారణం ఆ నిర్లక్ష్యమే!!

    • AP Cabinet : కాబినెట్ సమావేశంలో చర్చించే అంశాలేవీ..!!

    • Ande Sri: అందెశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటు – సీఎం రేవంత్

    • Miracle in the Mulugu Forest: ములుగు అడవుల్లో అద్భుతం

    Trending News

      • Akash Choudhary: విధ్వంసం.. 11 బంతుల్లోనే అర్ధ సెంచరీ!

      • Digital Gold: డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెడుతున్నారా? మీకొక షాకింగ్ న్యూస్‌!

      • IND vs AUS: భార‌త్‌- ఆస్ట్రేలియా మ్యాచ్ ర‌ద్దు కావ‌డానికి కార‌ణం పిడుగులేనా?

      • Strong Room: ఎన్నిక‌ల త‌ర్వాత ఈవీఎంల‌ను స్ట్రాంగ్ రూమ్‌లో ఎందుకు ఉంచుతారు?

      • Junio Payments: బ్యాంకు ఖాతా లేకుండానే యూపీఐ.. పిల్లలు కూడా ఆన్‌లైన్ చెల్లింపులు చేయొచ్చు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd