HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Bumrah To Return For Odi World Cup R Ashwin Says Major Hint

ODI World Cup: బూమ్రా వరల్డ్ కప్ ఆడతాడా.. అశ్విన్ ఏం చెప్పాడంటే..?

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వన్డే ప్రపంచ కప్ (ODI World Cup) అక్టోబర్ లో భారత్ వేదికగా జరగనుంది.

  • Author : Hashtag U Date : 02-07-2023 - 1:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bumrah On Fire
Bumrah On Fire

ODI World Cup: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వన్డే ప్రపంచ కప్ (ODI World Cup) అక్టోబర్ లో భారత్ వేదికగా జరగనుంది. ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ కూడా వచ్చేసింది. సొంత గడ్డపై టీమిండియా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. అయితే పలువురు సీనియర్ ఆటగాళ్ళ గాయాలు భారత్ కు ఆందోళన కలిగిస్తున్నాయి. కె ఎల్ రాహుల్, రిషబ్ పంత్, బూమ్రా వంటి ప్లేయర్స్ మెగా ఈవెంట్ సమయానికి కోలుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. ముఖ్యంగా బూమ్రా లాంటి స్టార్ పేసర్ జట్టులో ఉండాల్సిందే. గత ఏడాది నుంచీ గాయం నుంచి కోలుకుని మళ్లీ ఫిట్ నెస్ సమస్యలతో ఆటకు దూరమయ్యాడు. ఈ నేపద్యంలో బూమ్రా (Bumrah) వన్డే ప్రపంచ కప్ ఆడతాడా అనే డౌట్ అందరినీ వేధిస్తోంది.

తాజాగా భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin).. బుమ్రా విషయంలో కీలక అప్‌డేట్ ఇచ్చాడు. అతను ఖచ్చితంగా ఆడాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు. ప్రస్తుతం ఫిట్ నెస్ సాధించే విషయంలో దృష్టి పెట్టాడని తెలిపాడు. తాము కచ్చితంగా బుమ్రాను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామనీ, కుదిరితే ప్రసిద్ధ్ కృష్ణ కూడా ఫిట్‌గా ఉంటే ఆడతాడనీ చెప్పాడు. అయితే జట్టును ఎలా ఎంపిక చేస్తారో ఇప్పుడే తెలియదన్నాడు. గతేడాది బుమ్రా విషయంలో తొందరపడిన బీసీసీఐ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఆసీస్‌తో టీ20 సిరీస్‌లో అతన్ని ఆడించడం వల్ల బుమ్రా గాయం తిరగబెట్టింది. దీంతో ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ రెండూ అతను ఆడలేదు. ఆగస్టు నెలలో జరిగే ఐర్లాండ్ టీ20 సిరీసులోనే బుమ్రా పునరాగమనం చేసే అవకాశం ఉంది.

Also Read: Rishabh Pant: రిషబ్ పంత్ వికెట్ కీపింగ్ చేయలేడా..? బీసీసీఐ అధికారి ఏం చెప్పాడంటే..?

కాగా వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లో భారత్ , ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఇక అందరూ ఎదురు చూస్తున్న భారత్ , పాకిస్థాన్ మ్యాచ్ అక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ పైనా అశ్విన్ స్పందించాడు. ఈ మ్యాచ్ మాత్రం అద్భుతంగా ఉంటుందన్నాడు.
ఇటీవలి కాలంలో ఐసీసీ ఈవెంట్లలో జరిగిన పాకిస్తాన్, ఇండియా మ్యాచ్‌లు చాలా అద్భుతంగా ఉన్నాయనీ , అహ్మదాబాద్‌లో మరో బ్లాక్ బస్టర్ మ్యాచ్‌నే చూస్తామని అశ్విన్ చెప్పాడు. భారత్, పాక్ మ్యాచ్ ను ఈ సారి లక్ష మందికి పైగా ఫాన్స్ ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ashwin
  • ICC ODI World Cup 2023
  • Jasprit Bumrah
  • ODI World Cup
  • ODI World Cup 2023
  • team india

Related News

Vaibhav Suryavanshi to make his debut in the second T20 between India and England today!

vaibhav suryavanshi: నేడు భారత్-ఇంగ్లాండ్ రెండో టీ20లో.. వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం.!

ఇంగ్లండ్‌తో ఇవాళ జరగనున్న రెండో టీ20 మ్యాచ్‌లో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టీమిండియా తరఫున అరంగేట్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘కొత్త అధ్యాయం’ అనే క్యాప్షన్‌తో అతను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఒక స్టోరీ ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. యూకే పర్యటనలో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ20లు, ఇంగ్లండ్‌తో వర్షం కారణంగా రద్దయిన తొలి టీ20లోనూ వైభవ్ బెంచ్‌కే పరి

  • India vs. Sri Lanka Test series schedule...

    IND vs SL: ఇండియా, శ్రీలంక టెస్ట్ సిరీస్ షెడ్యూల్..

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd