Border-Gavaskar Trophy: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సమరానికి సై
ప్రపంచ క్రికెట్‌లో రెండు అత్యుత్తమ జట్లు సంప్రదాయ ఫార్మాట్‌లో తలపడితే అభిమానులకు అంతకుమించి కిక్ ఏముంటుంది.. ఉత్కంఠభరిత సమరాలకు వేదికగా నిలిచే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy) మరో 3 రోజుల్లో షురూ కాబోతోంది.
- By Hashtag U Published Date - 09:35 AM, Tue - 7 February 23

ప్రపంచ క్రికెట్‌లో రెండు అత్యుత్తమ జట్లు సంప్రదాయ ఫార్మాట్‌లో తలపడితే అభిమానులకు అంతకుమించి కిక్ ఏముంటుంది.. ఉత్కంఠభరిత సమరాలకు వేదికగా నిలిచే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy) మరో 3 రోజుల్లో షురూ కాబోతోంది. గత ఏడాది సొంతగడ్డపై ఎదురైన పరాభవానికి ప్రతీకారం కోసం ఆసీస్ పట్టుదలగా ఉంటే.. మరోసారి తమ ఆధిపత్యం నిలుపుకోవాలని భారత్ భావిస్తోంది. గత కొన్నేళ్ళుగా భారత్, ఆస్ట్రేలియా జట్లు ఏ ఫార్మాట్‌లో తలపడినా అభిమానులు అసలు సిసలు క్రికెట్ మజా ఆస్వాదిస్తున్నారు. టి ట్వంటీలైనా, వన్డేలైనా, టెస్టులైనా హోరాహోరీ మ్యాచ్‌లు ఫ్యాన్స్‌కు కిక్ ఇస్తున్నాయి. ఆసీస్ ఆధిపత్యానికి చెక్ పెట్టిన టీమిండియా సొంతగడ్డపైనే కాదు కంగారూ గడ్డపైనా దుమ్మురేపింది.
ముఖ్యంగా గత రెండు పర్యటనల్లోనూ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకుని కంగారూలను దెబ్బకొట్టింది. సీనియర్లు లేకున్నా 2021 ఆసీస్ టూర్‌లో చారిత్రక సిరీస్ విజయాన్ని అందుకుంది. తొలి టెస్టులో 36 పరుగులకే కుప్పకూలిన తర్వాత టీమిండియా పుంజుకున్న తీరు అద్భుతమనే చెప్పాలి. ఇప్పుడు ఆ పరాభవానికి రివేంజ్ తీర్చుకోవాలన్న లక్ష్యంతో ఆస్ట్రేలియా జట్టు సిద్ధమైంది. గురువారం నుంచి ఇరు జట్ల మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ షురూ కాబోతోంది. ఈ సిరీస్‌కు సంబంధించి ఓవరాల్ రికార్డుల్లో టీమిండియాదే పైచేయి. 1996లో మొదలైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇప్పటి వరకూ 15 సిరీస్‌లు జరిగితే.. భారత్ 9 గెలిచింది. ఐదింటిలో ఆసీస్ విజయం సాధిస్తే.. ఒక సిరీస్ డ్రాగా ముగిసింది.
అన్నింటికీ మించి భారత్‌లో సిరీస్ గెలవడం అంత ఈజీ కాదన్నది ఆసీస్‌కు తెలుసు. గత రికార్డులే దీనికి నిదర్శనం. ఇప్పటి వరకూ భారత్ గడ్డపై 8 సిరీస్‌లు ఆడిన ఆసీస్ కేవలం ఒక్కసారి మాత్రమే విజయం సాధించింది. మిగిలిన 7 సిరీస్‌ల్లోనూ భారత్‌దే పైచేయిగా నిలిచింది. అటు ఈ సిరీస్‌లో ఇప్పటి వరకూ 52 టెస్టులు జరగ్గా.. భారత్ 22 , ఆసీస్ 19 టెస్టుల్లో విజయం సాధించాయి. మరో 11 డ్రాగా ముగియగా.. టీమిండియా విన్నింగ్ రికార్డ్ 42.30గా ఉంది.
Also Read: Women IPL: మార్చి 4 నుంచే మహిళల ఐపీఎల్
2016 నుంచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మన దగ్గరే ఉంది. ఆ ఏడాది స్వదేశంలో సిరీస్ గెలిచిన భారత్ తర్వాత వరుసగా రెండుసార్లు ఆసీస్ గడ్డపై అదరగొట్టింది. వారి సొంతగడ్డపైనే ఆసీస్‌కు షాకిచ్చిన టీమిండియా ఇప్పుడు స్వదేశంలో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. బూమ్రా లేకున్నా భారత్ పేస్ బలం ఏమాత్రం తగ్గలేదు. యువ, సీనియర్ల బౌలింగ్‌తో బరిలోకి దిగుతున్న మన జట్టుకు మరోసారి స్పిన్నర్లే ప్రధాన బలం కానున్నారు. అటు భారత్ పిచ్‌లపై ఎదురయ్యే స్పిన్ సవాల్‌కు పూర్తి స్థాయిలో రెడీ అయ్యింది ఆస్ట్రేలియా. బంతి గింగిరాలు తిరిగే పిచ్‌లపైనే ప్రాక్టీస్ చేస్తోంది.

Related News

UPI Payments: యూపీఐతో చెల్లింపులు చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
సైబర్ నేరగాళ్ల మాయలో పడి అనేక మంది తాము కష్టపడి సంపాదించిన డబ్బును పోగొట్టుకుంటున్నారు. స్కామర్లు ఎప్పటికప్పుడు కొత్త స్కీమ్‌లతో అమాయకులకు టోపీ..