CWG Silver Medal: వెయిట్ లిఫ్టింగ్ లో బింద్యారాణికి రజతం
కామన్ వెల్త్ గేమ్స్ లో భారత వెయిట్ లిఫ్టర్ల జోరు కొనసాగుతోంది. రెండోరోజు మీరాబాయి చాను స్వర్ణం సాధించగా... సంకేత్ సర్గార్ రజతం, గురురాజా పుజారి కాంస్యం సాధించారు.
- Author : Naresh Kumar
Date : 31-07-2022 - 11:38 IST
Published By : Hashtagu Telugu Desk
కామన్ వెల్త్ గేమ్స్ లో భారత వెయిట్ లిఫ్టర్ల జోరు కొనసాగుతోంది. రెండోరోజు మీరాబాయి చాను స్వర్ణం సాధించగా… సంకేత్ సర్గార్ రజతం, గురురాజా పుజారి కాంస్యం సాధించారు.
మహిళల విభాగంలో మరో వెయిట్ లిఫ్టర్ బింద్యారాణి కూడా సత్తా చాటింది. 55 కిలోల విభాగంలో బింద్యారాణి దేవి రజతం గెలిచింది. 23 ఏళ్ల బింద్యారాణి స్నాచ్‌లో 86 కేజీలు, క్లీన్ అండ జెర్క్ కేటగిరిలో 116 కేజీలు.. మొత్తంగా 202 కేజీలు ఎత్తి రెండో స్థానంలో నిలిచింది. బింద్యారాణి క్లీన్ అండ్ జర్క్ రెండో ప్రయత్నంలో 114 కిలోలు ఎత్తడంలో విఫలమైంది. దీంతో అంతా ఆమెకు కాంస్యం వస్తుందని భావించారు.
అయితే చివరి రౌండ్‌లో పుంజుకున్న బింద్యారాణి..116 కిలోలు ఎత్తి రజతం కైవసం చేసుకుంది. నైజీరియాకు చెందిన అడిజట్ ఒలారినోయ్ 117 కిలోల బరువెత్తి గోల్డ్ మెడల్ సాధించింది. ఒక్క కేజీ కేజీ తేడాతో బింద్యారాణి రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాగా, బింద్యారాణి సాధించిన పతకంతో కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల సంఖ్య నాలుగుకు చేరింది. ఈ నాలుగు వెయిట్‌లిఫ్టింగ్‌లోనే వచ్చాయి.
ప్రస్తుతం భారత్ పతకాల పట్టికలో టాప్ 10లో కొనసాగుతోంది. కాగా రజతం గెలిచిన బింద్యారాణికి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ఆమె కష్టానికి ఫలితం దక్కిందంటూ ప్రశంసించారు. మోదీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు ప్రముఖులు బింద్యారాణిని అభినందించారు.
Congratulations to Bindyarani Devi for winning a Silver medal at CWG, Birmingham. This accomplishment is a manifestation of her tenacity and it has made every Indian very happy. I wish her the very best for her future endeavours. pic.twitter.com/4Z3cgVYZvv
— Narendra Modi (@narendramodi) July 31, 2022