BCCI Offer: ఇక టెస్ట్ మ్యాచ్ కు రూ.45 లక్షలు… ఆటగాళ్లకు బీసీసీఐ బంపర్ ఆఫర్
ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ గెలిచి ఫుల్ జోష్ లో ఉన్న భారత ఆటగాళ్లకు బీసీసీఐ బంపర్ ఆఫర్ ఇచ్చింది. టెస్ట్ క్రికెట్ ఆడే ఆటగాళ్లకు భారీ నజరానా ప్రకటించింది. మ్యాచ్ ఫీజు ఏకంగా మూడు రెట్లు పెంచింది. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ జై షా.. ఆటగాళ్ల ఇన్‌సెంటీవ్ వివరాలను సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
- Author : Praveen Aluthuru
Date : 09-03-2024 - 6:44 IST
Published By : Hashtagu Telugu Desk
BCCI Offer: ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ గెలిచి ఫుల్ జోష్ లో ఉన్న భారత ఆటగాళ్లకు బీసీసీఐ బంపర్ ఆఫర్ ఇచ్చింది. టెస్ట్ క్రికెట్ ఆడే ఆటగాళ్లకు భారీ నజరానా ప్రకటించింది. మ్యాచ్ ఫీజు ఏకంగా మూడు రెట్లు పెంచింది. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ జై షా.. ఆటగాళ్ల ఇన్‌సెంటీవ్ వివరాలను సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ప్రస్తుతం టెస్ట్ మ్యాచ్ కు 15 లక్షలు ఇస్తుండగా ఇకపై 45 లక్షలు అందజేయనుంది. అయితే దీనికి కొన్ని కండిషన్స్ పెట్టింది. దీని ప్రకారం.. ఏడాది కాలంలో ఓ ఆటగాడు 75 శాతం కంటే ఎక్కువ టెస్ట్‌లు ఆడితే ప్రతీ మ్యాచ్‌కు 45 లక్షల చొప్పున అధిక వేతనాన్ని అందిస్తుంది. సగం కంటే ఎక్కువ టెస్ట్‌లు ఆడితే ప్రతీ మ్యాచ్‌కు 30 లక్షల చొప్పున ఇన్‌సెంటీవ్ గా అందుకోనున్నారు.
అలాగే తుది జట్టులో ఆడని ఆటగాళ్లు 50 శాతం ఎక్కువ మ్యాచ్‌ల్లో జట్టుతో ఉంటే ఒక్కో టెస్ట్‌కు 15 లక్షలు.. 75 శాతం కంటే ఎక్కువ మ్యాచ్‌ల్లో బెంచ్‌కు పరిమితమైతే 22.5 లక్షలు అందుకోనున్నారు.సగం కంటే తక్కువ మ్యాచ్‌లు ఆడితే మాత్రం ఈ ఇన్‌సెంటీవ్ రాదు. టెస్ట్ క్రికెట్‌కు కుర్రాళ్లు ప్రాధాన్యం ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు జై షా తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఒక సీజన్‌లో భారత్ 9 టెస్ట్‌లోఆడితే.. అందులో 5 లేదా 6 మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లకు ప్రతీ మ్యాచ్‌కు 30 లక్షల చొప్పున, 7 లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లకు 45 లక్షల చొప్పున ఇన్‌సెంటీవ్ రూపంలో అందుతుంది. 4 మ్యాచ్‌లు ఆడినా.. ఈ ఇన్‌సెంటీవ్ లభించదు. ఇది భారత ఆటగాళ్ల అర్థిక వృద్ధి, నిలకడను ఉద్దేశించి తీసుకున్న నిర్ణయమని, 2022-23 సీజన్ నుంచే ఈ స్కీమ్‌ను అమలు చేయాలనుకుంటున్నట్టు జై షా చెప్పారు.
Also Read: Nabam Tuki : కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన అరుణాచల్ మాజీ ముఖ్యమంత్రి