HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Bcci Fires Fresh Warning To Mohsin Naqvi Over Asia Cup Trophy Row

Asia Cup Trophy: ఆసియా కప్ ట్రోఫీ వివాదం.. బీసీసీఐ సంచలన నిర్ణయం!

కొన్ని వారాల క్రితం సెప్టెంబర్ 30న జరిగిన ఏసీసీ సమావేశంలో బీసీసీఐ ఉపాధ్యక్షులు, భారత ప్రతినిధి అయిన రాజీవ్ శుక్లా పాల్గొన్నారు.

  • Author : Gopi Date : 21-10-2025 - 6:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Asia Cup Trophy
Asia Cup Trophy

Asia Cup Trophy: ఆసియా కప్ ట్రోఫీ (Asia Cup Trophy) వివాదంపై బీసీసీఐ (BCCI) పెద్ద చర్య తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో రాబోయే ఐసీసీ (ICC) సమావేశంలో ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని అంతర్జాతీయ బోర్డును కోరే అవకాశం ఉంది. ట్రోఫీని భారత జట్టుకు అందించాలని కోరుతూ బీసీసీఐ గత వారం లేఖ పంపింది. అయితే నఖ్వీ వైపు నుంచి ఎలాంటి సమాధానం రాలేదని తెలుస్తోంది. దీంతో బీసీసీఐ గట్టి నిర్ణయం తీసుకుంది.

బీసీసీఐ హెచ్చరిక

భార‌త జ‌ట్టుకు ట్రోఫీని అందజేయాలని బీసీసీఐ స్పష్టంగా తేల్చి చెప్పింది. లేదంటే త్వరలో జరగబోయే ఐసీసీ సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తుతామని ప్రకటించింది. ప్రస్తుతం ఆసియా కప్ ట్రోఫీ దుబాయ్‌లోని ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) కార్యాలయంలో భద్రపరచబడి ఉంది. ఒక మీడియా నివేదిక ప్రకారం బీసీసీఐ కార్యదర్శి దేవజీత్ సైకియా మాట్లాడుతూ.. భారత బోర్డు చట్ట ప్రకారం ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తోందని తెలిపారు.

Also Read: Delhi Air Quality: ఢిల్లీలో కమ్ముకున్న కాలుష్యపు పొగ.. ‘రెడ్ జోన్’లో గాలి నాణ్యత!

వివాదం ఎక్కడ మొదలైంది?

ఆసియా కప్ ఫైనల్‌లో భారత జట్టు పాకిస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన తర్వాత ఏసీసీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించడంతో ఈ వివాదం మొదలైంది. కొద్దిసేపటి తర్వాత మొహ్సిన్ నఖ్వీ ట్రోఫీని తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోయారు.

నఖ్వీ వైఖరిపై బీసీసీఐ అభ్యంతరం

కొన్ని వారాల క్రితం సెప్టెంబర్ 30న జరిగిన ఏసీసీ సమావేశంలో బీసీసీఐ ఉపాధ్యక్షులు, భారత ప్రతినిధి అయిన రాజీవ్ శుక్లా పాల్గొన్నారు. ఆ సమావేశంలో రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. ట్రోఫీ ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ఆస్తి కాబట్టి నఖ్వీ వ్యక్తిగతంగా ట్రోఫీని మైదానం నుండి తీసుకెళ్లడానికి అధికారం లేదని పేర్కొన్నారు.

ఏసీసీ బోర్డు సభ్యుల ముందు క్షమాపణ చెప్పినప్పటికీ నఖ్వీ జట్టు ఇండియాకు ట్రోఫీ ఇవ్వడానికి నిరాకరించారు. టీమ్ ఇండియా ట్రోఫీని తీసుకెళ్లాలనుకుంటే దుబాయ్‌లోని ఏసీసీ కార్యాలయానికి వచ్చి తన చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవాలని ఆయన పట్టుబట్టినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో బీసీసీఐ ఇప్పుడు ఐసీసీ జోక్యాన్ని కోరేందుకు సిద్ధమవుతోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Asia Cup News
  • Asia Cup Trophy
  • BCCI
  • india cricket team
  • Mohsin Naqvi
  • sports news

Related News

    Latest News

    • Cm Revanth: యువతకు సీఎం రేవంత్ రెడ్డి సందేశం

    • Shopping: షాపింగ్ ప్రియులకు గుడ్ న్యూస్

    • Cm Revanth: తెలంగాణలో కార్మికులకు భారీ శుభవార్త చెప్పిన సీఎం రేవంత్

    • Balineni Srinivasa Reddy: జగన్ కి మైండ్ దొబ్బింది : బాలినేని

    • Ys Jagan: మా తాతను, నాన్నను, చిన్నాన్నను చంపింది ఎవరు?

    Trending News

      • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

      • Beer Price Drop: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..రూ.185 బీర్ ధర రూ.110 కి..70 రూ .ల తగ్గింపు

      • Rahul Gandhi: దేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతోంది : రాహుల్‌ గాంధీ

      • UAE: భారత్‌తో యూఏఈ కీలక ఒప్పందాలు.. ఇంధన రంగంలో భారీ డీల్స్‌

      • Inflation In India: దేశవ్యాప్తంగా పెరిగిన నిత్యావసరాలు ధరలు

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd