WTC Final 2023: వారెవ్వా అక్షర్.. వాట్ ఏ త్రో
గురువారం భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్ రెండో రోజు ఆట కొనసాగుతోంది. 327/3 స్కోరుతో రెండో రోజు ఇన్నింగ్స్‌ను పొడిగించిన ఆస్ట్రేలియా లంచ్ సమయానికి 109 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 422 పరుగులు చేసింది.
- Author : Praveen Aluthuru
Date : 08-06-2023 - 7:50 IST
Published By : Hashtagu Telugu Desk
WTC Final 2023: గురువారం భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్ రెండో రోజు ఆట కొనసాగుతోంది. 327/3 స్కోరుతో రెండో రోజు ఇన్నింగ్స్‌ను పొడిగించిన ఆస్ట్రేలియా లంచ్ సమయానికి 109 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 422 పరుగులు చేసింది. రెండో రోజు తొలి సెషన్‌లో భారత జట్టు 95 పరుగులు చేసి నాలుగు వికెట్లు పడగొట్టింది. ఈ సమయంలో అక్షర్ పటేల్ వేసిన త్రో వైరల్ గా మారింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ లో మిచెల్ స్టార్క్ రనౌట్ అవ్వడంలో అక్షర్ పటేల్ వేసిన త్రో డైరెక్ట్ గా వికెట్లను తాకింది.
Axar Patel with a brilliant RUN OUT!#CricketTwitter #INDvsAUS #WTC23Final #WTCFinal pic.twitter.com/zqbFRHLKQQ
— chasingthetarget (@chasingtarget) June 8, 2023
మహ్మద్ సిరాజ్ వేసిన ఓవర్ ఐదవ బంతికి, స్టార్క్ మిడ్-ఆఫ్ దిశలో షాట్ ఆడాడు. పరుగు కోసం ప్రయత్నించిన క్రమంలో అక్షర్ పటేల్ అద్భుతమైన ఫీల్డ్ తో ఆకట్టుకున్నాడు. రన్నింగ్ లో ఉన్న బంతిని పట్టుకుని వికెట్లను త్రో వేశాడు. దీంతో బంతి నేరుగా స్టంప్స్‌కి తగిలింది. .మిచెల్ స్టార్క్‌ను అక్షర్ పటేల్ రన్నౌట్ చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. స్టార్క్ 20 బంతుల్లో 5 పరుగులు చేశాడు. స్టార్క్ రనౌట్ అయ్యే సమయానికి ఆస్ట్రేలియా స్కోరు 402/7.
Read More: Ambati Rayudu: సీఎం జగన్ ని కలిసిన సీఎస్‌కే మేనేజ్‌మెంట్