world cup 2023: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్..హెడ్ డకౌట్
వాంఖడే స్టేడియంలో ఆఫ్ఘనిస్థాన్ అదరగొడుతుంది. మెగాటోర్నీలో సంచలనాలు సృష్టిస్తూ వచ్చిన ఆఫ్ఘన్ జట్టు ఆస్ట్రేలియాపై సత్తా చాటుతుంది. ఈ రోజు ముంబై వేదికగా ఇరు జట్లు తలపడుతున్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ జట్టు ఇబ్రహీం జద్రాన్ అజేయ సెంచరీ
- Author : Praveen Aluthuru
Date : 07-11-2023 - 6:44 IST
Published By : Hashtagu Telugu Desk
world cup 2023: వాంఖడే స్టేడియంలో ఆఫ్ఘనిస్థాన్ అదరగొడుతుంది. మెగాటోర్నీలో సంచలనాలు సృష్టిస్తూ వచ్చిన ఆఫ్ఘన్ జట్టు ఆస్ట్రేలియాపై సత్తా చాటుతుంది. ఈ రోజు ముంబై వేదికగా ఇరు జట్లు తలపడుతున్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ జట్టు ఇబ్రహీం జద్రాన్ అజేయ సెంచరీతో 5 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసి ఆస్ట్రేలియాకు 292 పరుగుల విజయలక్ష్యాన్ని అందించింది. భారీ లక్ష్యఛేదనలో ఆసీస్ ఆరంభం నుంచే తడబడుతుంది.నవీన్ ఉల్ హక్ బౌలింగ్ లోట్రావిస్ హెడ్ అవుట్ అయ్యాడు. దీంతో ఖాతా తెరవకుండానే హెడ్ పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం డేవిడ్ వార్నర్ , మిచెల్ మార్ష్ క్రీజులో ఉన్నారు. వార్నర్ వేగంగా ఆడుతున్నాడు. డేవిడ్ వార్నర్ మూడు ఫోర్లు బాదాడు. దీంతో 18 బంతుల్లో 15 పరుగులతో క్రీజులో ఉన్నాడు. మరో ఎండ్ లో మిచెల్ నెమ్మదిగా ఆడుతున్నాడు.
ఆస్ట్రేలియా జట్టు: ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, మార్నస్ లాబుస్చాగ్నే, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా మరియు జోష్ హేజిల్‌వుడ్.
ఆఫ్ఘనిస్తాన్ జట్టు: రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), రహ్మత్ షా, అజ్మతుల్లా ఒమర్జాయ్, ఇక్రమ్ అలీఖిల్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నూర్ అహ్మద్ మరియు నవీన్ ఉల్ హక్.
Also Read: KTR: కాంగ్రెస్ స్కాములపై బీఆర్ఎస్ పుస్తకం, కేటీఆర్ చేతుల మీదుగా పుస్తకావిష్కరణ