HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Brs Book On Congress Scams Book Launch By Ktr

KTR: కాంగ్రెస్ స్కాములపై బీఆర్ఎస్ పుస్తకం, కేటీఆర్ చేతుల మీదుగా పుస్తకావిష్కరణ

“తెలంగాణలో కాంగ్రెస్ పాపాల శతకం”, “స్కాంగ్రెస్” పుస్తకాలను హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఆయన ఆవిష్కరించారు.

  • Author : Balu J Date : 07-11-2023 - 6:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Congress
Congress

KTR: పూర్వం కవులు శతకపద్యాలు రాసినట్టు, చిత్రగుప్తుడు మనుషుల పాపాల చిట్టా రాసినట్టు.. ఇప్పుడు కాంగ్రెస్ పాపాల గురించి శతకాలు, గ్రంథాలు రాయాల్సి వస్తోందన్నారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారాకరామారావు. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా విభాగం రూపొందించిన “తెలంగాణలో కాంగ్రెస్ పాపాల శతకం”, “స్కాంగ్రెస్” పుస్తకాలను హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఆయన ఆవిష్కరించారు. రాష్ట్రానికి, దేశానికి కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసిందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక అత్యధిక కాలం పాలించిన పార్టీ… దేశాన్ని పూర్తిగా గాలికి వదిలేసి దోచుకోవడమే పనిగా పెట్టుకుందన్నారు. ఆ పాపాల చిట్టాలను రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలు తెలియజేయాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై, తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని ఆయన అన్నారు. కాంగ్రెస్ తెలంగాణకు చేసిన ద్రోహాన్ని, దేశంలో చేసిన స్కాములను పుస్తకరూపంలో తీసుకొచ్చిన సోషల్ మీడియా విభాగాన్ని ఆయన అభినందించారు.

తెలంగాణకు కాంగ్రెస్ శతాధిక ద్రోహం..

అత్యధిక కాలం పాటు రాష్ట్రాన్ని పాలించి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంతానికి చేసిన ద్రోహం, అన్యాయాలను వివరిస్తూ “తెలంగాణలో కాంగ్రెస్ పాపాల శతకం” అనే పుస్తకాన్ని రూపొందించడం జరిగింది. హైదరాబాద్ స్టేట్ ను ఆంధ్రా ప్రాంతంతో కలపడం మొదలు.. తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు బలిగొన్న యువకులు, ఉద్యమకారుల గురించి ఈ పుస్తకంలో వివరించడం జరిగింది. కాంగ్రెస్ పాలనలో కరెంటు కష్టాలు, నీళ్ల కష్టాలు, అన్నదాతల కన్నీరు, ఆత్మహత్యలు, నేతన్నల ఉరితాళ్లు, పదవుల కోసం పాకులాడుతూ.. సాగునీటి రంగంలో తెలంగాణకు కాంగ్రెస్ చేసిన అన్యాయం, సుసంపన్న రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఎలా పడావుబెట్టిందనే విషయాలను ఇందులో తెలియజేయడం జరిగింది. ఇలాంటి “కాంగ్రెస్ కు ఎందుకు ఓటేయాలి..? అని ఆ పార్టీని ప్రశ్నించడం జరిగింది.

ఏ టూ జెడ్ స్కాముల పార్టీ..

కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కాముల పార్టీ అనే పేరుంది. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో చేసిన A టూ Z స్కాముల గురించి “స్కాంగ్రెస్” పుస్తకంలో వివరించడం జరిగింది. అక్రమార్కులకు, దోపిడీ దారులకు, స్కామర్లకు అండగా ఉండి లక్షల కోట్ల కుంభకోణాలకు కారణమైంది కాంగ్రెస్ పార్టీ. ఆ రంగం, ఈ రంగం అని లేదు.. బొగ్గు నుంచి కామన్ వెల్త్ గేమ్స్ దాకా దేన్నీ వదల్లేదు. చివరకు ఆర్మీ వాహనాల కొనుగోలులోనూ తమ కక్కుర్తి ప్రదర్శించింది. అగస్టా వెస్ట్ లాండ్ స్కాం, బోఫోర్స్ స్కాం, ఆర్మీ వాహనాల కొనుగోలు స్కాం, కోల్ స్కాం, 2జీ స్కాం, ఇలా చెప్పుకుంటూ పోతే “స్కాంగ్రెస్” చిట్టా చాలా పెద్దగా ఉంటుంది. ఆ వివరాలన్నీ “స్కాంగ్రెస్” పుస్తకంలో వివరించడం జరిగింది. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్లు వై.సతీష్ రెడ్డి, జగన్ మోహన్ రావు, దినేష్ చౌదరి,మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • congress
  • hyderabad
  • ktr
  • Scams

Related News

Murder Sketch On Second Wif

Murder Sketch : రెండో భార్యపై మర్డర్ స్కెచ్ చేసి పోలీసులకు అడ్డంగా దొరికిన వ్యక్తి

నిందితుడు అరుణ్ కుమార్‌కు మల్కాజిగిరికి చెందిన మహమ్మద్ అబ్బు మరియు యాకుత్‌పురకు చెందిన మీర్ ముజమ్మిల్ సహకరించారు. ముఖ్యంగా ముజమ్మిల్ అక్రమ ఆయుధాలకు నిలయమైన బీహార్‌లోని ముంగేర్ ప్రాంతానికి

  • Ktr

    పొట్టను దాచుకోవడం కష్టంగా ఉంది.. కేటీఆర్ ఆసక్తికర పోస్ట్

  • Kavita Fire

    Kavitha : కాంగ్రెస్ సర్కార్ తీరుపై కవిత ఆగ్రహం

  • Abhishek Manu Singhvi And V

    Rajya Sabha : తెలంగాణ నుంచి రాజ్యసభకు సింఘ్వీ, నరేందర్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక!

  • Shivapratap Shukla Appointed As Telangana New Governor

    నేడు హైదరాబాద్‌కు కొత్తగవర్నర్ రాక.. స్వాగతం పలకనున్న సీఎం రేవంత్ రెడ్డి

Latest News

  • బాపు బొమ్మ-విశ్వ మహిళ అవార్డ్స్.. కొణిదెల అంజనాదేవికి తొలి పురస్కారం!

  • లోక్‌సభలో తెలంగాణను కించపరచలేదు.. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు క్లారిటీ

  • FBI : యూఎస్ బంపర్ ఆఫర్.. ఇతడిని పట్టిస్తే రూ. 9.18 కోట్లు రివార్డు మీవే..

  • చంద్రబాబు కీలక నిర్ణయాలు.. ఉగాది సందర్భంగా 2.5 లక్షల మందికి సీఎం కానుక!

  • Central Govt Good News : తెలంగాణకు కేంద్రం గొప్ప శుభవార్త

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd