Mitchell Marsh: ఫైనల్ లో టీమిండియాను 385 పరుగుల తేడాతో ఓడిస్తాం.. ఆసీస్ బ్యాటర్ కామెంట్స్ వైరల్..!
వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌పై ఆసీస్ ఆటగాడు మిచెల్ మార్ష్ (Mitchell Marsh) ఒక ప్రకటన చేశాడు.
- Author : Gopichand
Date : 17-11-2023 - 1:31 IST
Published By : Hashtagu Telugu Desk
Mitchell Marsh: వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌పై నిపుణులు ఇప్పటికే అంచనాలు వేయడం ప్రారంభించారు. దీనికి సంబంధించి ఆసీస్ ఆటగాడు మిచెల్ మార్ష్ (Mitchell Marsh) ఒక ప్రకటన చేశాడు. ఈ ప్రకటన గురించి తెలిసిన తర్వాత టీమిండియా అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఈ టోర్నీలో కంగారూ జట్టు ఇప్పటికే టీమిండియా చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. అయినప్పటికీ మిచెల్ మార్ష్ తమ జట్టు విజయంపై ధీమా వ్యక్తం చేశాడు.
అంతేకాకుండా మార్ష్ చేసిన కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియాను ఆసీస్ ఢీ కొంటుంది. ఆ మ్యాచ్ లో ఆసీస్ జట్టు 450/2 స్కోర్ చేస్తే టీమిండియా 65 పరుగులకే ఆల్ అవుట్ అవుతుంది. ఆసీస్ 385 పరుగుల తేడాతో గెలుస్తుంది అని మార్ష్ జోస్యం చెప్పాడు. ప్రస్తుతం మార్ష్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.
Also Read: Five Players: ఫైనల్ మ్యాచ్.. ఈ ఐదుగురు భారత ఆటగాళ్ల ప్రదర్శన చాలా కీలకం..!
రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమ్ ఇండియా విపరీతమైన ఫామ్‌లో ఉండటంతో పాటు ఆస్ట్రేలియాపై 2003 ప్రపంచకప్ ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రికీ పాంటింగ్ కెప్టెన్సీలో మెన్ ఇన్ ఎల్లో జోహన్నెస్‌బర్గ్‌లో సౌరవ్ గంగూలీ జట్టును 125 పరుగుల తేడాతో ఓడించింది. పాంటింగ్ 140 పరుగులతో ఆస్ట్రేలియాను 50 ఓవర్లలో 359 పరుగులకు చేర్చగా, గ్లెన్ మెక్‌గ్రాత్ బంతితో 3 వికెట్లు పడగొట్టాడు. టోర్నమెంట్‌లో అజేయంగా నిలిచిన భారత్ టైటిల్ గెలవడానికి ఫైనల్‌లోకి ప్రవేశించింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్‌ను ఓడించి సెమీస్‌కు చేరుకుంది. ఆస్ట్రేలియా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికాపై మూడు వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది.
We’re now on WhatsApp. Click to Join.