Five Players: ఫైనల్ మ్యాచ్.. ఈ ఐదుగురు భారత ఆటగాళ్ల ప్రదర్శన చాలా కీలకం..!
వరల్డ్ కప్ 2023 ఫైనల్ (World Cup Final) మ్యాచ్ నవంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఈసారి టైటిల్ గెలవాలంటే ఐదుగురు భారత ఆటగాళ్ల (Five Players) ప్రదర్శన చాలా కీలకం.
- Author : Gopichand
Date : 17-11-2023 - 10:24 IST
Published By : Hashtagu Telugu Desk
Five Players: వరల్డ్ కప్ 2023 ఫైనల్ (World Cup Final) మ్యాచ్ నవంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. సెమీస్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి, దక్షిణాఫ్రికాను ఆస్ట్రేలియా ఓడించి ఫైనల్స్‌కు చేరుకుంది. ఈసారి టైటిల్ గెలవాలంటే ఐదుగురు భారత ఆటగాళ్ల (Five Players) ప్రదర్శన చాలా కీలకం. అందరి దృష్టి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా,రవీంద్ర జడేజాలపైనే ఉంది.
శుభారంభం చేసే బాధ్యత రోహిత్‌పైనే
భారత్‌కు శుభారంభం అందించాల్సిన బాధ్యత రోహిత్‌పై ఉంది. శుభ్‌మన్ గిల్‌తో బలమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పడం రోహిత్ కి చాలా ముఖ్యం. ఈ ప్రపంచకప్‌లో చాలా మ్యాచ్‌ల్లో భారత్‌కు రోహిత్ శుభారంభాలు అందించాడు. ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, పాకిస్థాన్‌లపై మంచి ప్రదర్శన చేశాడు. రోహిత్ ఆఫ్ఘనిస్తాన్‌పై 131, పాకిస్థాన్‌పై 86, బంగ్లాదేశ్‌పై 48, ఇంగ్లండ్‌పై 87 పరుగులు చేశాడు.
విరాట్ కోహ్లి సెంచరీ చేస్తే విజయం సులువు
ఈ ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. మూడు సెంచరీలు కూడా చేశాడు. విరాట్ బ్యాట్ రాణిస్తే భారత్‌కు విజయం సులువవుతుంది. సెమీఫైనల్లో న్యూజిలాండ్‌పై సెంచరీ సాధించాడు. అంతకుముందు దక్షిణాఫ్రికాపై 101 పరుగులతో అజేయంగా ఇన్నింగ్స్ ఆడాడు.
షమీ-బుమ్రా మ్యాజిక్ చూపించాలి
సెమీఫైనల్‌లో భారత్ తరఫున ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ 7 వికెట్లు పడగొట్టాడు. న్యూజిలాండ్ వెన్ను విరిచాడు. ఫైనల్‌లోనూ షమీ అద్భుత ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. ఈ ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా అగ్రస్థానంలో ఉన్నాడు. షమీ 6 మ్యాచ్‌ల్లో 23 వికెట్లు తీశాడు. జస్ప్రీత్ బుమ్రా ఐదో స్థానంలో ఉన్నాడు. 10 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు తీశాడు. బుమ్రా ప్రదర్శన కూడా జట్టుకు చాలా కీలకం. వీరిద్దరూ ఆస్ట్రేలియాపై రాణిస్తే విజయం మనదే అవుతుంది.
We’re now on WhatsApp. Click to Join.
రవీంద్ర జడేజా పటిష్ట ప్రదర్శన చేయాల్సి ఉంటుంది
ఫైనల్ మ్యాచ్‌లో జడేజా ఆల్‌రౌండర్ పాత్ర పోషించాల్సి ఉంటుంది. గాయం కారణంగా హార్దిక్ పాండ్యా ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. ఆల్‌రౌండర్‌గా పాండ్యా అద్భుతంగా రాణించాడు. ఫాస్ట్ బౌలర్‌గా జట్టుకు కీలక పాత్ర కూడా పోషించాడు. ఇప్పుడు ఆ బాధ్యత జడేజాపైనే ఉంటుంది. స్పిన్ బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్‌తో కలిసి జడేజా అద్భుతంగా రాణించాల్సి ఉంటుంది.