Asian Games 2023 : ఆసియా క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించిన జ్యోతి సురేఖ.. విజయవాడలో ఘన స్వాగతం పలికి శాప్ అధికారులు
ఆసియా క్రీడలు 2023లో బంగారు పతక విజేత జ్యోతి సురేఖకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) ప్రతినిధులు ఘన
- By Prasad Published Date - 10:17 PM, Wed - 11 October 23

ఆసియా క్రీడలు 2023లో బంగారు పతక విజేత జ్యోతి సురేఖకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. హాంగ్‌జౌలో జరిగిన ఆసియా క్రీడలు 2023లో ఆర్చరీ విభాగంలో ఆంధ్రప్రదేశ్ (విజయవాడ)కు చెందిన జ్యోతి సురేఖ వెన్నం మూడు బంగారు పతకాలు సాధించింది. ఆసియా క్రీడల అనంతరం జ్యోతి సురేఖ, భారత బృందం ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. అనంతరం ఆమె తన స్వస్థలం విజయవాడకు తిరిగి వచ్చారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు, స్థానిక విద్యార్థులు ఆమెకు అపూర్వమైన స్వాగతం పలికారు. ఆసియా క్రీడల్లో జ్యోతి సురేఖ అద్భుతమైన విజయాన్ని సాధించారని శాప్ ప్రతినిధులు అభినందించారు. దేశానికి మూడు బంగారు పతకాలు తీసుకురావడం పట్ల జ్యోతి సురేఖ హర్షం వ్యక్తం చేశారు. తన కుటుంబ సభ్యుల మద్దతుతోనే తను ఈ విజయాన్ని సాధించానని తెలిపారుజ భవిష్యత్తు లక్ష్యాలను సాధించేందుకు కృషి చేస్తానని జ్యోతి సురేఖ తెలిపారు. ప్రోత్సాహం అందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. స్పోర్ట్స్ పాలసీకి అనుగుణంగా తనకు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం కల్పించి ఆదుకున్నందుకు ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
Also Read: World Cup 2023: భారత్-పాక్ మ్యాచ్‌కు బాంబు బెదిరింపు