Team India New Sponsor: టీమిండియా కొత్త జెర్సీ స్పాన్సర్ ఇదే.. డీల్ ఎంతంటే?
అపోలో టైర్స్- బీసీసీఐ మధ్య 579 కోట్ల రూపాయల డీల్ కుదిరింది. దీని ప్రకారం అపోలో టైర్స్ ప్రతి మ్యాచ్‌కు దాదాపు 4.77 కోట్ల రూపాయలు బీసీసీఐకి చెల్లిస్తుంది.
- By Gopichand Published Date - 06:54 PM, Tue - 16 September 25

Team India New Sponsor: అపోలో టైర్స్ భారత క్రికెట్ జట్టు కొత్త జెర్సీ స్పాన్సర్‌గా మారింది. కొన్ని వారాల క్రితం వరకు భారత జట్టు ‘Dream11’ జెర్సీతో ఆడింది. కానీ ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు తర్వాత ఆ సంస్థ ఆ డీల్‌ను మధ్యలోనే రద్దు చేసుకోవాల్సి వచ్చింది. అపోలో టైర్స్‌తో (Team India New Sponsor) ఒప్పందం ఖరారు అయినట్లు బీసీసీఐ అధికారికంగా ధ్రువీకరించింది. ఈ ఒప్పందం 579 కోట్ల రూపాయలతో కుదిరిందని, ఇది తదుపరి రెండున్నర సంవత్సరాల వరకు కొనసాగుతుందని తెలిసింది. ఈ కాలంలో భారత జట్టు 121 ద్వైపాక్షిక మ్యాచ్‌లు, 21 మల్టీ-నేషన్ టోర్నమెంట్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.
హర్యానాలోని గురుగ్రామ్‌లో ఉన్న అపోలో టైర్స్ ప్రపంచంలోని 100కి పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ స్పాన్సర్‌షిప్ కోసం కెన్‌వా మరియు జేకే సిమెంట్స్ కంపెనీల నుండి పోటీ ఎదురైంది. అవి వరుసగా 544 కోట్లు, 477 కోట్ల రూపాయలకు బిడ్ వేశాయి.
🚨 𝙉𝙀𝙒𝙎 🚨#TeamIndia 🤝 Apollo Tyres
BCCI announces Apollo Tyres as new lead Sponsor of Team India.
All The Details 🔽 @apollotyreshttps://t.co/dYBd2nbOk2
— BCCI (@BCCI) September 16, 2025
Also Read: Sam Konstas: టెస్ట్‌ను వన్డేగా మార్చిన ఆస్ట్రేలియా బ్యాటర్.. అద్భుత సెంచరీ!
ప్రతి మ్యాచ్‌కు బీసీసీఐకి కోట్లు
అపోలో టైర్స్- బీసీసీఐ మధ్య 579 కోట్ల రూపాయల డీల్ కుదిరింది. దీని ప్రకారం అపోలో టైర్స్ ప్రతి మ్యాచ్‌కు దాదాపు 4.77 కోట్ల రూపాయలు బీసీసీఐకి చెల్లిస్తుంది. ద్వైపాక్షిక మ్యాచ్‌లకు ఐసీసీ టోర్నమెంట్ మ్యాచ్‌లకు ఈ మొత్తం వేర్వేరుగా ఉండవచ్చు. బోర్డు ద్వైపాక్షిక మ్యాచ్‌లకు 3.5 కోట్లు, ప్రపంచ కప్ మ్యాచ్‌లకు 1.5 కోట్ల రూపాయల బేస్ ప్రైస్ సెట్ చేసింది. సమయానికి జెర్సీలు సిద్ధం చేయడానికి వీలుగా ఇండియా ‘ఎ’ జట్టు స్క్వాడ్‌ను త్వరగా విడుదల చేయాలని బీసీసీఐ సెలక్టర్లకు సందేశం పంపింది. ఇండియా ‘ఎ’ జట్టు ప్రస్తుతం లక్నోలో ఆస్ట్రేలియాపై మొదటి అనధికారిక టెస్ట్ ఆడుతోంది. రెండవ టెస్ట్ సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం కానుంది.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన శంక్ ఎయిర్, దుబాయ్ కంపెనీ ‘ఓమ్నియత్’ కూడా స్పాన్సర్‌షిప్ కోసం ఆసక్తి చూపాయి. అయితే అవి ఏ బిడ్ వేయలేదు. బీసీసీఐ గత స్పాన్సర్‌షిప్ డీల్ ద్వారా 200 కోట్లకు పైగా సంపాదించింది. డ్రీమ్11 మూడు సంవత్సరాల డీల్ కోసం 358 కోట్లు చెల్లించగా, అపోలో టైర్స్ అదే కాలానికి 579 కోట్లు చెల్లించాల్సి ఉంది.