World Cup 2023 : కోహ్లీని ఓదార్చిన అనుష్క శర్మ..
స్వదేశీ గడ్డ ఫై కూడా గెలుచుకోలేకపోయామే అని యావత్ అభిమానులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. వరుస గెలిచి..అసలైన ఆటలోనే ఓడిపోయామే అని టీం సైతం బాధపడుతున్నారు
- By Sudheer Published Date - 10:26 AM, Mon - 20 November 23

మరోసారి టీం ఇండియా వరల్డ్ కప్ (World Cup 2023) ను గెలుచుకోలేకపోయింది. చేతికి అందినట్లే అంది..ఖంగారులు (Australia) ఎత్తుకెళ్లారు. స్వదేశీ గడ్డ ఫై కూడా గెలుచుకోలేకపోయామే అని యావత్ అభిమానులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. వరుస గెలిచి..అసలైన ఆటలోనే ఓడిపోయామే అని టీం సైతం బాధపడుతున్నారు. విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) లైతే మైదానంలోనే కన్నీటి పర్యంతమయ్యారు. తీవ్ర విచారంలో కూరుకుపోయిన విరాట్ కోహ్లీకి భార్య అనుష్క శర్మ అండగా నిలిచింది. భర్తను కౌగిలించుకుని ఓదార్చే ప్రయత్నం చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అలాగే ఎప్పుడు కూల్ గా కనిపించే రోహిత్ శర్మ… సైతం మ్యాచ్ పోగానే కన్నింటిని ఆపుకోలేకపోయారు. ఉబికి వస్తున్న కన్నీటిని దాచుకునేందుకు తలదించుకుని మైదానం నుంచి బయటికి వచ్చేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇక మహ్మద్ సిరాజ్ మైదానంలోనే కన్నీటి పర్యంతమయ్యాడు. సిరాజ్ ను బుమ్రా, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్ ఓదార్చడం కనిపించింది. ఏదేమైనా, వరుసగా 10 మ్యాచ్ లు గెలిచి, ఫైనల్లో ఓడిపోవడం టీమిండియా ఆటగాళ్లను తీవ్ర వేదనకు గురిచేసింది.
We’re now on WhatsApp. Click to Join.
ఇక ఆస్ట్రేలియా ఒకటి ,రెండు ,మూడు కాదు ఏకంగా ఆరోవసారి వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడింది. తొలుత బ్యాటింగ్‌లో టీమిండియాను తక్కువ పరుగులకే అవుట్ చేసిన ఆస్ట్రేలియా ఆ తర్వాత సునాయసంగా లక్ష్యాన్ని ఛేదించి ఆరోసారి ప్రపంచకప్‌ను దక్కించుకున్నారు. టీంఇండియా నిర్ణీత 50 ఓవర్ లలో 240 పరుగులు చేయగా ఆస్ట్రేలియా మరో 42 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.
Read Also : Liquor Sales : ఎన్నికల టైం.. అయినా లిక్కర్ సేల్స్ డౌన్
Related News

Ind vs Aus T20: రుతురాజ్ కు సారీ చెప్పిన యశస్వి జైస్వాల్
టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో పవర్ ప్లేలో అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాళ్లలో మొదటి స్థానంలో నిలిచాడు. నిన్న తిరువనంతపురంలో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్