HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Another Ruckus In Hca Agm Is Near The Gate

HCA Azharuddin : హెచ్ సిఏలో మరో రచ్చ… గేటు దగ్గరే ఏజీఏం

భారత్ (India) మాజీ కెప్టెన్ అజారుద్దీన్ (Azharuddin) ప్రెసిడెంట్ గా వచ్చిన తర్వాత అంతర్గత పోరు తారాస్థాయికి చేరింది.

  • Author : Maheswara Rao Nadella Date : 12-12-2022 - 10:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hca Azharuddin
Hca Azharuddin

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఆట కంటే వివాదాలతోనే వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అవినీతి ఆరోపణలు (Accusations) అంతర్గత విబేధాలు సరేసరి భారత్ (India) మాజీ కెప్టెన్ అజారుద్దీన్ (Azharuddin) ప్రెసిడెంట్ గా వచ్చిన తర్వాత అంతర్గత పోరు తారాస్థాయికి చేరింది. పదవీ కాలం ముగిసినా కూడా ఎన్నికలు నిర్వహించడం లేదంటూ అజారుద్దీన్ పై ఆగ్రహంతో ఉన్న అసమ్మతి వర్గం ప్రత్యేక ఏజీఏం నిర్వహించేందుకు సన్నద్ధమయింది. అయితే అజారుద్దీన్ HCA సభ్యులను ఉప్పల్ స్టేడియం (Uppal Stadium) లోపలికి రానీయకుండా సిబ్బందితో గేట్లు మూయించడం దుమారం రేపుతోంది. దీంతో గేటు బయటే టెంట్ వేసుకొని వారంతా ప్రత్యేక AGM నిర్వహించుకున్నారు.

అజారుద్దీన్ (Azharuddin) తీరుపై HCA మాజీ సెక్రటరీ శేషు నారాయణ మండిపడ్డారు. సమావేశానికి తమను అనుమతించకుండా గేట్లను మూసేయడం దారుణమని, తెలంగాణ రాష్టానికి ఇది బ్లాక్ డే అని ఫైర్ అయ్యారు. ఈ ఘటనపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని శేషు నారాయణ డిమాండ్ చేశారు. జనరల్ బాడీ లోపల పెట్టుకోవడానికి కూడా అనుమతి ఇవ్వలేదని, HCA సభ్యులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.

సెప్టెంబర్ 26న అజారుద్దీన్ పదవీకాలం ముగిసిందని, కానీ ఇప్పటివరకు ఎన్నికలు నిర్వహించలేదని శేషు నారాయణ తెలిపారు. జనవరి 10న HCA ఎన్నికలు జరపనున్నట్లు వెల్లడించారు. పదవీకాలం ముగిసినా ఇంకా అజారుద్దీన్ హెచ్‌సీఏ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారని, వచ్చే నెలలో ఎన్నికలు జరిపి తీరుతామని మాజీ ప్రెసిడెంట్ వినోద్ చెప్పారు. సభ్యులందరం కలిసి హెచ్‌సీఏను కాపాడుతామని స్పష్టం చేశారు. అజారుద్దీన్ (Azharuddin) అధ్యక్షుడయ్యాక హెచ్‌సీఏ ఎప్పుడూ ఏదోక వివాదంలో ఉంటుంది. గతంలో మ్యాచ్ నిర్వహణ, టికెట్ల ఇష్యూలో హెచ్‌సీఏ వైఫల్యం చెందిందనే ఆరోపణలు గట్టిగా వినిపించాయి. ఇక హెచ్‌సీఏ తరపున ఆటగాళ్లను ఆడించడం కోసం ఒక్కో మ్యాచ్‌కు రూ.15 లక్షలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రతిభావంతులైన క్రికెటర్లకు అన్యాయం జరుగుతూనే ఉందనీ పలువురు మండిపడుతున్నారు. ఇకనైనా ఇలాంటి ఆరోపణలు రాకుండా అన్ని వివాదాలకు ముగింపు పడాలని క్రీడాభిమానులు కోరుకుంటున్నారు.

Also Read:  Kanpur : కాన్పూర్‌లో ఐదుగురు బంగ్లాదేశీయుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AGM
  • Association
  • azharuddin
  • cricket
  • elections
  • HCA
  • hyderabad
  • sports
  • telangana
  • Uppal stadium

Related News

International Thalassemia Day

Nara Bhuvaneswari: ‘తలసేమియా రన్’ వ్యాధిపై అవగాహన కల్పించి చిన్నారులు అండగా నిలవాలని నారా భువనేశ్వరి

తలసేమియా వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆదివారం హైదరాబాద్‌లో భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నగరంలోని నెక్లెస్ రోడ్డులో ‘తలసేమియా రన్’ను ఘనంగా నిర్వహించింది. జలవిహార్ వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. ఈ పరుగులో 3K, 5K, 10K విభా

  • Retired IPS Officer Wife Incident in Jubilee Hills

    Hyderabad: జూబ్లీహిల్స్ లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య

  • New Policy on Fee Reimbursement in Telangana

    Telangana Fee Reimbursement: తెలంగాణ ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో కొత్త పాలసీ!

Latest News

  • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

  • Cm Vijay: తొలి సంతకం ఉచిత విద్యుత్ పై సీఎం విజయ్

  • TVK Vijay: సీఎం‌గా దళపతి విజయ్ ప్రమాణస్వీకారం… హాజరైన ప్రముఖులు

  • Tamil Nadu: తమిళనాడు మంత్రివర్గంలో తెలుగు బిడ్డ ఎస్. కీర్తన

  • Vijay Joseph: సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం..

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd