HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Another International Cricket Stadium In Hyderabad

International Cricket Stedim : హైదరాబాద్ లో మరో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం..

హైదరాబాద్​లో నూతన స్టేడియం నిర్మించాలని హెచ్​సీఏ భావిస్తుంది

  • Author : Sudheer Date : 30-07-2024 - 9:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Another International Crick
Another International Crick

క్రికెట్ లవర్స్ (Cricket Lovers) కు హెచ్​సీఏ (HCA) గుడ్ న్యూస్ చెప్పబోతుందా..? హైదరాబాద్ (Hyderabad) లో మరో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం (International Cricket Stadium ) ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తుందా..? అంటే అవుననే చెప్పాలి. ప్రస్తుతం ఉప్పల్ (Uppal) లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం (Rajiv Gandhi International Stadium) ఉన్న సంగతి తెలిసిందే. ఈ స్టేడియం ఇండియా టీం కే కాదు ఇండియన్ క్రికెట్ లవర్స్ కూడా ఎంతో ఇష్టం. ఎందుకంటే టీమిండియా ఆడే మ్యాచులతో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్​లో సన్​రైజర్స్ హైదరాబాద్ ఆడే మ్యాచుకు ఎక్కువగా ఈ స్టేడియం లో జరుగుతాయి. అలాగే ఈ స్టేడియం లో అడిగిన మ్యాచ్ లు ఎక్కువగా టీం ఇండియా విజయం సాదిస్తుంటుంది. దీంతో ఈ స్టేడియం అంటే క్రికెట్ అభిమానులకు పిచ్చి. కాకపోతే ఈ స్టేడియంలో సీటింగ్ కెపాసిటీ (38 వేలు) మాత్రమే. దీంతో IPL మ్యాచ్ టైం లో అభిమానులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీంతో హైదరాబాద్​లో నూతన స్టేడియం నిర్మించాలని హెచ్​సీఏ భావిస్తుంది. దీనికి గాను నగర శివార్లలో 100 ఎకరాల్లో కనీవినీ ఎరుగని రీతిలో స్టేడియాన్ని కట్టాలని డిసైడ్ అయ్యారు. లక్ష సీటింగ్ కెపాసిటీతో అధునాతన సౌకర్యాలతో నూతన స్టేడియాన్ని నిర్మించేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పెద్దలు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ విషయాన్ని హెచ్​సీఏ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు (Jagan Mohan Rao) తెలిపారు. ఇంటర్నేషనల్ స్టేడియంతో పాటు రాష్ట్రంలోని 8 ఉమ్మడి జిల్లాల్లో మినీ స్టేడియాలను కూడా నిర్మించనున్నామని తెలిపి క్రికెట్ అభిమానుల్లో సంతోషం నింపారు.

We’re now on WhatsApp. Click to Join.

కొత్త స్టేడియంతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో మినీ స్టేడియాల నిర్మాణానికి భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని జగన్ మోహన్ రావు తెలిపారు. స్టేడియాల నిర్మాణ ప్రక్రియలో భాగంగా తొలుత భూముల సేకరణ చేపడతామన్నారు. భూముల సేకరణ పూర్తయితే బీసీసీఐ నుంచి నిధులు విడుదలవుతాయని పేర్కొన్నారు. భూములను సర్కారు నుంచి లీజుకు తీసుకోకుండా హెచ్​సీఏ తరఫున కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. గవర్నమెంట్ నుంచి భూములు కొనుగోలు చేస్తే న్యాయపరమైన చిక్కులు రావన్నారు. ఈ విషయం మీద క్రీడా మంత్రిత్వ శాఖతో జిల్లా కలెక్టర్లు, అధికారులను సంప్రదించామన్నారు. మరి ఈ స్టేడియం లు ఎప్పుడు..ఎక్కడెక్కడ నిర్మిస్తారో చూడాలి.

Read Also : Congres vs BRS : తాము దింపిన బుల్లెట్ కేసీఆర్ కు బలంగా దిగింది – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2nd international cricket stadium in Hyderabad
  • cricket lovers
  • hyderabad
  • international cricket stadium
  • Rajiv Gandhi International Stadium

Related News

Draft Of 'core Urban Region

GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

దశాబ్దాలుగా అమలులో ఉన్న పాత పట్టణ పాలన విధానాలకు బదులుగా ఆధునిక నగర అవసరాలకు సరిపోయే సమగ్ర చట్టాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ క్రమంలో ‘కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్లు–2026’ ముసాయిదాను అధికారికంగా విడుదల చేసింది.

  • Big shock for Bandla Ganesh... High Court's crucial decision on property auction.

    Bandla Ganesh: బండ్ల గణేశ్‌‌కు బిగ్ షాక్.. ఆస్తి వేలంపై హైకోర్టు కీలక నిర్ణయం

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd