Anand Mahindra Gift: ప్రజ్ఞానంద తల్లిదండ్రులకు ఆనంద్ మహీంద్ర అదిరిపోయే గిఫ్ట్.. తల్లిదండ్రులకు కీలక సూచన..!
బాకులో జరిగిన చెస్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ భారత్‌కు చెందిన 18 ఏళ్ల ఆర్ ప్రజ్ఞానంద (Praggnanandhaa) నార్వేకు చెందిన మాగ్నస్ కార్ల్‌సెన్ మధ్య జరిగింది. ప్రజ్ఞానంద గురించి ఇప్పుడు మహీంద్రా & మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా పెద్ద ప్రకటన చేసి, అతనికి కారును బహుమతి (Anand Mahindra Gift)గా ఇస్తున్నట్లు ప్రకటించారు.
- By Gopichand Published Date - 06:25 AM, Tue - 29 August 23

Anand Mahindra Gift: బాకులో జరిగిన చెస్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ భారత్‌కు చెందిన 18 ఏళ్ల ఆర్ ప్రజ్ఞానంద (Praggnanandhaa) నార్వేకు చెందిన మాగ్నస్ కార్ల్‌సెన్ మధ్య జరిగింది. ప్రజ్ఞానంద ఈ మ్యాచ్‌లో తన ఆటతో కోట్లాది మంది దేశప్రజల హృదయాలను గెలుచుకున్నాడు. ప్రజ్ఞానంద గురించి ఇప్పుడు మహీంద్రా & మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా పెద్ద ప్రకటన చేసి, అతనికి కారును బహుమతి (Anand Mahindra Gift)గా ఇస్తున్నట్లు ప్రకటించారు. భారతదేశం నుండి చెస్ ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరిన అతి పిన్న వయస్కుడైన భారతీయ చెస్ ఆటగాడు ఆర్ ప్రజ్ఞానంద. ఆనంద్ మహీంద్రా తన తల్లిదండ్రులకు ఎలక్ట్రిక్ XUV400 కారును బహుమతిగా ఇవ్వడం గురించి మాట్లాడాడు.
ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఇలా రాసుకొచ్చారు. మీ సెంటిమెంట్‌ను అభినందిస్తున్నాను. ప్రజ్ఞానందకు థార్ వాహనాన్ని బహుమతిగా ఇవ్వమని చాలా మంది కోరుతున్నారు. కానీ, నా బుర్రలో మరో ఆలోచన ఉంది. ప్రజ్ఞానంద తల్లిదండ్రులు తమ కుమారుడిని చిన్నప్నటి నుంచి చదరంగం క్రీడలో ప్రోత్సహించి, ఈ స్థాయికి తీసుకొచ్చారు. వారికి కృతజ్ఞతగా, ప్రోత్సాహకరంగా మహీంద్ర XUV4OO EV వాహనాన్ని గిఫ్ట్‌గా ఇవ్వాలని భావిస్తున్నాను. తల్లిదండ్రులు తమ పిల్లలకు వీడియో గేమ్‌లకు బదులుగా చెస్ ఆటను నేర్పించాలనే సలహా ఇచ్చారు. అది మేథస్సును పెంచేందుకు తోడ్పడుతుందని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.
Also Read: Blind Cricket: క్రికెట్ లో సత్తా చాటుతున్న ఏపీ అంధ బాలిక.. ఆస్ట్రేలియాను ఒడించి, టైటిల్ గెలిచి!
మూడు రోజుల ఆట తర్వాత విజేత ప్రకటన
చెస్ ప్రపంచకప్ ఫైనల్‌లో టైబ్రేకర్ మ్యాచ్ తర్వాత విజేతను నిర్ణయించారు. ఈ మ్యాచ్‌లో మొదటి రోజు ప్రజ్ఞానంద, కార్ల్‌సెన్ మధ్య జరిగిన మ్యాచ్ దాదాపు 70 ఎత్తుగడల తర్వాత డ్రాగా ముగిసింది. దీని తర్వాత రెండో రోజు మ్యాచ్ ఆడినప్పుడు 35 కదలికల తర్వాత డ్రాగా ప్రకటించబడింది. మూడో రోజు ఇద్దరు ఆటగాళ్ల మధ్య టైబ్రేకర్ మ్యాచ్ జరగగా, అందులో మాగ్నస్ కార్ల్‌సన్ విజయం సాధించాడు.