Afghanistan: ఆఫ్ఘనిస్థాన్ ప్రధాన కోచ్ జోనాథన్ ట్రాట్ కాంట్రాక్ట్ పొడిగింపు..!
జనవరి రెండో వారంలో భారత్‌లో పర్యటించనున్న ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan) జట్టు ప్రధాన కోచ్ బాధ్యత మరోసారి ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ జోనాథన్ ట్రాట్ భుజస్కంధాలపై మోపనుంది.
- By Gopichand Published Date - 02:00 PM, Tue - 2 January 24

Afghanistan: జనవరి రెండో వారంలో భారత్‌లో పర్యటించనున్న ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan) జట్టు ప్రధాన కోచ్ బాధ్యత మరోసారి ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ జోనాథన్ ట్రాట్ భుజస్కంధాలపై మోపనుంది. ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు అతని పదవీకాలాన్ని ఏడాది పాటు పొడిగించింది. ఇప్పుడు అతను ఈ ఏడాది మొత్తం ఆఫ్ఘనిస్థాన్ కోచ్‌గా కొనసాగనున్నాడు. జోనాథన్ ట్రాట్ 18 నెలల క్రితం ఆఫ్ఘనిస్తాన్‌కు ప్రధాన కోచ్‌గా మారాడు. ఈ ఏడాదిన్నర పదవీ కాలంలో ఆఫ్ఘన్ జట్టుకు గొప్ప విజయాలను అందించాడు. ఇటీవల ముగిసిన ప్రపంచ కప్ 2023లో ఆఫ్ఘనిస్తాన్ పెద్ద జట్లను ఒకదాని తర్వాత ఒకటిగా ఓడించడం ద్వారా అతిపెద్ద విజయం సాధించింది.
2023 ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్.. పాకిస్థాన్, ఇంగ్లండ్, శ్రీలంక, నెదర్లాండ్‌లను ఓడించింది. ఆస్ట్రేలియాను కూడా ఓడించడానికి దగ్గరగా వచ్చింది. అయితే మాక్స్ వెల్ ఈ విజయాన్ని ఆఫ్ఘనిస్తాన్ నుండి లాగేసుకున్నాడు. ఆఫ్ఘన్ జట్టు ఈ అద్భుతమైన ప్రదర్శన తర్వాత మాత్రమ కోచ్‌గా ట్రాట్ పదవిని పొడిగించాలని బోర్డు అధికారులు నిర్ణయించారు.
Also Read: India vs South Africa: అరగంట ఆలస్యంగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్టు..!?
పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లను ఓడించింది
ట్రాట్ మార్గదర్శకత్వంలో ఆఫ్ఘనిస్తాన్ 23 ODI మ్యాచ్‌లలో 8 గెలిచింది. ఇందులో ప్రపంచ కప్‌లో బలమైన ప్రదర్శనతో పాటు బంగ్లాదేశ్‌పై ఏకైక వన్డే సిరీస్ విజయం కూడా ఉంది. ఈ సమయంలో ఆఫ్ఘనిస్తాన్ 26 టీ20 ఇంటర్నేషనల్స్ కూడా ఆడింది. ఇక్కడ 11 మ్యాచ్ లలో విజయం సాధించింది. ట్రాట్ నేతృత్వంలోని ఏకైక టీ20 సిరీస్‌లో ఆఫ్ఘనిస్తాన్.. పాకిస్థాన్‌ను ఓడించింది.
We’re now on WhatsApp. Click to Join.
ట్రాట్ కెరీర్
జోనాథన్ ట్రాట్ ఇంగ్లండ్ దిగ్గజ ఆటగాడు. 52 టెస్టుల్లో 3835 పరుగులు చేశాడు. 2010-11లో యాషెస్ సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. వన్డే క్రికెట్‌లో కూడా ట్రాట్ 51 సగటుతో 2819 పరుగులు చేశాడు. 2015లో క్రికెట్ నుంచి రిటైరయ్యాడు.