Maha Kumbh Mela 2025 : YuppTV CEO పాడి ఉదయ్ రెడ్డి పవిత్ర స్నానం
Maha Kumbh Mela 2025 : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్ సంగమ్ వద్ద జరుగుతున్న ఈ మహా కుంభమేళాలో యాప్ టీవీ (YuppTV) CEO పాడి ఉదయ్ రెడ్డి (Padi Uday Reddy) గారు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు
- By Sudheer Published Date - 08:27 PM, Tue - 18 February 25

144 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరిగే మహాకుంభమేళా అద్భుతమైన ఆధ్యాత్మిక మహోత్సవంగా నిర్వహించబడుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్ సంగమ్ వద్ద జరుగుతున్న ఈ మహా కుంభమేళాలో యాప్ టీవీ (YuppTV) CEO పాడి ఉదయ్ రెడ్డి (Padi Uday Reddy) గారు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. సనాతన ధర్మానికి ఎంతో ప్రాధాన్యమైన ఈ మహోత్సవంలో భాగంగా, ఆయన గంగ, యమునా, సరస్వతి నదుల సంగమంలో పవిత్ర స్నానం ఆచరించి, ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. సంగమ్ ప్రదేశంలో పవిత్ర స్నానం చేయడం ద్వారా పాప విమోచనం కలుగుతుందనే నమ్మకం ఉంది. ఇది మానసిక, ఆధ్యాత్మిక శుద్ధికి సహాయపడటమే కాకుండా, మోక్షానికి దారి చూపుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి. మహా కుంభమేళా విశ్వవ్యాప్త ఆధ్యాత్మిక సమావేశంగా, కోట్లాది భక్తులకు ఒకటిగా కలిసే అద్భుత వేదికగా నిలుస్తోంది. పాడి ఉదయ్ రెడ్డి కూడా ఈ పవిత్ర ఘట్టంలో భాగమై, భారతీయ సంస్కృతిని గౌరవించాలనే ఆత్మీయ అభిలాషతో పుణ్యస్నానం చేసినట్లు తెలిపారు.
ఈ మహోత్సవంలో భాగంగా దేశవ్యాప్తంగా ఎందరో మహా సాధువులు, భక్తులు, ప్రముఖులు హాజరవుతుండగా వారి మధ్య పాడి ఉదయ్ రెడ్డి కూడా స్నానం ప్రత్యేకమైన దృష్టిని ఆకర్షించింది. ఈ మహాకుంభమేళా కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమమే కాకుండా, భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటే గొప్ప సంబరంగా మారింది. ఈ పవిత్ర క్షణాల్లో పాల్గొన్నందుకు గర్వంగా ఉందని, ఇలాంటి అపూర్వ అవకాశాలు మరోసారి లభించాలని పాడి ఉదయ్ రెడ్డి ఆశించారు.