RK Roja : ఏదేమైనా పెంచిన ఛార్జీలు తగ్గించేవరకు పోరాటం ఆగదు
RK Roja : రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపు నిరసిస్తూ ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. నగరిలో జరిగిన నిరసనల్లో మాజీ మంత్రి, వైఎస్ఆర్‌సీపీ నాయకురాలు ఆర్కే రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె బైక్ ర్యాలీ నిర్వహించి.. నగరి కూడలిలో ధర్నాకు దిగారు.
- By Kavya Krishna Published Date - 04:59 PM, Fri - 27 December 24

RK Roja : విద్యుత్ ఛార్జీల పెంపుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన బాట పట్టింది. ర్యాలీలు, బైక్ ర్యాలీలు, నిరసన సమావేశాలు వంటి పలు కార్యక్రమాల ద్వారా ప్రజల సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ప్రయత్నిస్తున్నారు. తిరుపతి జిల్లాలో నిర్వహించిన ఒక నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఇష్టమైన కారు ఇదే!
చంద్రబాబు ఎన్నికల హామీలను పూర్తిగా విస్మరించారని ఆరోపించిన రోజా, విద్యుత్ ఛార్జీల పెంపుపై పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీల గురించి ప్రశ్నించారు. “కూటమి ప్రభుత్వం ప్రజలపై భారాన్ని పెంచుతూ వస్తుంటే, డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కల్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నారు?” అని నిలదీశారు ఆర్కే రోజా. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు “విద్యుత్ ఛార్జీలు పెంచం, వీలైతే తగ్గిస్తాం” అని చెప్పి, ఇప్పుడు ప్రజలపై భారాన్ని పెంచారని ఆర్కే రోజా మండిపడ్డారు. “పవన్ కల్యాణ్ ‘పెంచిన ఛార్జీలను ఒప్పుకోమని’ చెప్పి, ఇప్పుడు ఆచరణలో ఎందుకు స్పందించలేకపోతున్నారు? ఆయన ముఖ్యమంత్రిని ప్రశ్నించడానికి ఎందుకు వెనుకడుగేస్తున్నారు?” అని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలను వెనక్కి తీసుకునే వరకు వైఎస్సార్‌సీపీ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతుండగా, ప్రజలపై పెరుగుతున్న విద్యుత్ భారాన్ని తగ్గించాలనే డిమాండ్‌తో ఈ ఆందోళనలు చేపడుతున్నట్లు రోజా తెలిపారు. రాష్ట్రంలో ఏం జరిగినా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కారణం అంటూ ఆరోపణ చేస్తున్నారని ఆర్కే రోజా మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి సిగ్గుందా? అని రోజా ప్రశ్నించారు. ఈ రోజు బాబు హామీలకు ష్యూరిటీ లేదు, ఆయన మాటలకు గ్యారంటీ లేదు అంటూ ఆమె విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా.. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేశారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ రోజు వీధి వీధికి మద్యం షాపులు పెట్టి ప్రజలను పీల్చి పిప్పిచేస్తున్నారు అని రోజా ఆరోపించారు.
Honda SP160: మార్కెట్లోకి విడుదలైన హోండా ఎస్పీ 160 2025 బైక్.. ధర తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!