AP: ఎన్నికల ప్రచారంలో వైసీపీ నాయకుల తంటాలు
ఇలా వైసీపీ ఎన్నికల సభల నుంచి ప్రజలు బయటకు వెళ్లకుండా నిలువరించేందుకు విశాఖ నేతలు వారికి భోజనాలను ఎర వేస్తున్నారని, అధికార నేతల గంటల తరబడి ప్రసంగాలను వినలేక ప్రజలు ఇంటి దారి పడుతున్నారని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు
- Author : Sudheer
Date : 02-04-2024 - 2:53 IST
Published By : Hashtagu Telugu Desk
ఎన్నికల ప్రచారం(Election Campaign)లో వైసీపీ నేతల (YCP Leaders) అవస్థలు అన్ని ఇన్ని కావు..ఎక్కడిక్కడే ప్రజలు ఐదేళ్లలో ఏంచేశారని నిలదీస్తూ వస్తుండడం తో వారికీ సమాధానం చెప్పలేక అక్కడి నుండి జారుకుంటున్నారు. ఎంత సేపు సంక్షేమ పథకాలు అందించామని చెపుతున్నారు..అవి ఎంత మందికి అందుతున్నాయి అని ప్రశ్నించారు. రోడ్ల పరిస్థితి ఎలా ఉంది..? అభివృద్ధి ఎక్కడ ఉంది..? పిల్లలకు ఉద్యోగాలు ఏవి..? రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు ఏవి..? అని నిలదీస్తున్నారు. ఇదే అనుకునే ప్రచార సభల్లో వచ్చిన ప్రజలను ఆపేందుకు నానా తంటాలు పడుతున్నారు. అమ్మ భోజనం పెడతాం..అని మైకుల్లో మొత్తుకుంటున్నా పట్టించుకోకుండా వెళ్తున్నారు. మొన్న విజయసాయి రెడ్డి కి జరుగగా..ఈరోజు వైవీ సుబ్బారెడ్డి కి జరిగింది.
We’re now on WhatsApp. Click to Join.
పద్మనాభం మండలం రెడ్డిపల్లిలో అవంతి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారికి నేతలు సన్మానం చేస్తున్న క్రమంలో అప్పటికే విసుగెత్తిపోయిన ప్రజలు ఇంటికి తిరుగుబాట పట్టారు. దానిని గమనించిన ఓ వ్యక్తి అమ్మా భోజనాలు ఉన్నాయి ఎవరూ వెళ్లొద్దూ అంటూ మైక్‌లో చెప్పారు. వెంటనే అవంతి శ్రీనివాసరావు కలుగ చేసుకుని అలా చెప్పొద్దని వారించారు. ఇలా వైసీపీ ఎన్నికల సభల నుంచి ప్రజలు బయటకు వెళ్లకుండా నిలువరించేందుకు విశాఖ నేతలు వారికి భోజనాలను ఎర వేస్తున్నారని, అధికార నేతల గంటల తరబడి ప్రసంగాలను వినలేక ప్రజలు ఇంటి దారి పడుతున్నారని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు.
Read Also : Phone Tapping Case: సారీ చెప్పండి లేదంటే లీగల్ నోటీసులు పంపిస్తా: కేటీఆర్