Noida Bus Accident: యమహా ఉద్యోగుల బస్సు బోల్తా… పలువురికి గాయాలు
నోయిడాలో ఉద్యోగుల బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సూరజ్‌పూర్ భంగెల్ రోడ్డులో యమహా ఇండియా ఫ్యాక్టరీ ఉద్యోగులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది
- By Praveen Aluthuru Published Date - 07:04 PM, Tue - 20 June 23

Noida Bus Accident: నోయిడాలో ఉద్యోగుల బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సూరజ్‌పూర్ భంగెల్ రోడ్డులో యమహా ఇండియా ఫ్యాక్టరీ ఉద్యోగులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. బస్సు అతివేగంతో చెట్టును ఢీకొనడంతో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో స్థానికులు బస్సులో ఇరుక్కున్న ఉద్యోగులను బస్సు అద్దాలు పగులగొట్టి బయటకు తీశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బస్సులో మొత్తం 28 మంది ఉన్నారు. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణీకులందరూ సురక్షితంగా ఉన్నారని, కేవలం 6 మందికి మాత్రమే స్వల్ప గాయాలయ్యాయని, వారిని ప్రథమ చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు చెప్పారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Read More: Chiru-Keeravani: హిట్ కాంబినేషన్ రిపీట్.. దాదాపు 29 ఏళ్ల తర్వాత!