Hyderabad : ప్రారంభోత్సవానికి సిద్దమైన యాదవ, కురుమ సంఘం భవనాలు
అన్ని కులాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారని, వారి సంక్షేమానికి భారీ బడ్జెట్‌ను
- By Prasad Published Date - 06:47 AM, Sun - 8 January 23
అన్ని కులాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారని, వారి సంక్షేమానికి భారీ బడ్జెట్‌ను కేటాయిస్తున్నారని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరబాద్‌లో నూతనంగా నిర్మించిన యాదవ, కురుమ భవనాలను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ 41 కులాల వారు తమ కార్యకలాపాలు నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ భవనాలు మంజూరు చేశారని తెలిపారు. త్వరలో యాదవ, కురుమ భవన్‌ను ప్రారంభిస్తానని తలసాని తెలిపారు. యాదవ, కురుమ భవనాలను ఐదు ఎకరాల్లో ఒక్కొక్కటి రూ.5 కోట్లతో నిర్మించారు.