World Car Free Day 2023: నేడు వరల్డ్ కార్ ఫ్రీ డే ..అంటే ఏంటో..? ఎందుకు పిలుస్తారో తెలుసుకోండి
ప్రస్తుతం కార్ల వాడకం ఎంతగా పెరిగిందో చెప్పాల్సిన పనిలేదు. ఇంటిముందు చెప్పులు ఎలా కనిపిస్తాయో..ఆలా ఇంటి ముందు కార్లు కనిపిస్తున్నాయి. ఇంట్లో నలుగురు వ్యక్తులు ఉంటె ఆ నలుగురికి కార్లు ఉంటున్నాయి. ఓ ఇల్లు , కార్ అనేది సగటు వ్యక్తి కోరుకుంటున్నారు
- By Sudheer Published Date - 11:46 AM, Fri - 22 September 23

ప్రతి రోజు ఏదోక ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకత తెలుసుకునేందుకు చాలామంది ఉత్సాహం చూపిస్తుంటారు. ఆలా ఈరోజు (సెప్టెంబర్ 22) వరల్డ్ కార్ ఫ్రీ డే (World Car Free Day ). ఈరోజును ప్రపంచవ్యాప్తంగా ఉన్న నగరాలు జరుపుకుంటారు. ప్రస్తుతం కార్ల వాడకం ఎంతగా పెరిగిందో చెప్పాల్సిన పనిలేదు. ఇంటిముందు చెప్పులు ఎలా కనిపిస్తాయో..ఆలా ఇంటి ముందు కార్లు కనిపిస్తున్నాయి. ఇంట్లో నలుగురు వ్యక్తులు ఉంటె ఆ నలుగురికి కార్లు ఉంటున్నాయి. ఓ ఇల్లు , కార్ అనేది సగటు వ్యక్తి కోరుకుంటున్నారు.
ఈ మధ్య బైక్ లకంటే కార్లే చౌకగా వస్తున్నాయి. దీంతో సామాన్య వ్యక్తి సైతం కార్ కొనేస్తూ..ఫ్యామిలీ తో షికార్లు చేస్తున్నాడు. ఇలా రోజు రోజుకు నగరాల్లో కార్ల వాడకాలు పెరిగిపోతుండటం తో వాయు కాలుష్యం , గాలి కాలుష్యం , శబ్ద కాలుష్యం ఎక్కువై పోతుంది. దీనివల్ల ఆరోగ్యం పాడైపోతుంది. అందుకే ఏడాదిలో ఒక్కరోజైనా కార్లకు సెలవు ఉండాలని చెప్పి ఈరోజు వరల్డ్ కార్ ఫ్రీ డే (World Car-Free Day) ను జరుపుకుంటున్నారు.
ఈ వరల్డ్ కార్ ఫ్రీ డే (World Car-Free Day) ప్రత్యేకత ఏంటో తెలుసా..?
కార్ల కాలుష్యం, శబ్ద కాలుష్యం తగ్గించడం ఈరోజు ప్రత్యేకత. ప్రతి రోజు కార్ల లో ప్రయాణం చేసి ఆరోగ్యం పాడుచేసుకోవడం కంటే ఏడాదిలో ఈ ఒక్కరోజైనా మీ కార్లను పక్కకు పెట్టి..చక్కగా సైకిళ్ళ ఫై ప్రయాణం చేయడం..మీ పనులు చేయడం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది..అలాగే కార్ల కాలుష్యం, శబ్ద కాలుష్యం ఎంతో కొంత తగ్గుతుందని..ఈరోజున వరల్డ్ కార్ ఫ్రీ డే జరుపుకుంటారు.
ప్రపంచ కార్ ఫ్రీ డే అనేది కార్లు లేకుండా మన నగరాలు ఎలా ఉంటాయో చూపించడానికి ఓ ఉదాహరణ. మన వ్యక్తిగత ప్రయాణాలు, మనం నివసించే పట్టణ వాతావరణాన్ని పునరాలోచించుకోవడానికి, వాటి అవశ్యతను తెలుసుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం. అలాగే ప్రపంచ కార్ ఫ్రీ డే అనేది కార్ల శబ్దం, ఒత్తిడి, కాలుష్యం లేకుండా నగరాల్లో ప్రజా జీవితాన్ని జరుపుకునే వేడుక. సామూహిక రవాణా వల్ల కలిగే ఆర్థిక, సామాజిక, పర్యావరణ ప్రయోజనాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం దీని ముఖ్య ఉద్దేశ్యం.
ఈ వరల్డ్ కార్ ఫ్రీ డే (World Car-Free Day) ఎప్పుడు..ఎక్కడ మొదలు పెట్టారంటే..!
1990 లో యూరోపియన్ నగరాల్లో ఈ కార్ ఫ్రీ డేస్ స్టార్ట్ చేసాయి. 1999లో ఐరోపాలో అంతర్జాతీయ కార్‌ఫ్రీ డే నిర్వహించబడింది. ఇది యూరోపియన్ యూనియన్ యొక్క ఇన్ టౌన్ వితౌట్ మై కార్ ప్రచారం పైలట్ ప్రాజెక్ట్. ఈ ప్రచారం యూరోపియన్ మొబిలిటీ వీక్‌గా కొనసాగుతుంది. కార్-ఫ్రీ డేస్ 2000లో కార్బస్టర్స్ ప్రారంభించిన వరల్డ్ కార్ ఫ్రీ డే ప్రోగ్రామ్‌తో ప్రపంచ ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇప్పుడు వరల్డ్ కార్ ఫ్రీ నెట్‌వర్క్ గా మారిపోయింది.
ప్రతి ఏడాది కూడా ఈ వరల్డ్ కార్ ఫ్రీ డే రోజున రాజకీయ ప్రముఖులు , బిజినెస్ , క్రీడా, సినీ రంగాల వారు పెద్ద ఎత్తున రోడ్ల పైకి వారి సైకిళ్ల తో వస్తారు. రోడ్ల ఫై సైకిళ్ల తొక్కుతూ..వరల్డ్ కార్ ఫ్రీ డే ను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటూ..ప్రతి ఒక్కర్ని వరల్డ్ కార్ ఫ్రీ డే లో పాల్గొనాలని, ఈ వరల్డ్ కార్ ఫ్రీ డే ప్రత్యేకతను ప్రచారం చేస్తూ..ఆరోగ్య చిట్కాలను అందిస్తుంటారు. మీకు కూడా కార్ ఉంటె..ప్లీజ్ ఈ ఒక్క రోజు మీ కారు ను పక్కకు పెట్టి ఏచక్క సైకిల్ తొక్కుతూ మీ పనులు చేసుకొని , కాలుష్యాన్ని తగ్గించాలని కోరుకుంటున్నాం.