Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లు తక్షణం అమలు కోసం సుప్రీంకోర్టులో పిల్
ఇటీవల పార్లమెంట్ ఆమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల 2024 లోపు వీటిని అమలు చేయాలని పిటిషన్‌లో కోరారు.
- By Praveen Aluthuru Published Date - 05:43 PM, Mon - 16 October 23

Women Reservation Bill: ఇటీవల పార్లమెంట్ ఆమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల 2024 లోపు వీటిని అమలు చేయాలని పిటిషన్‌లో కోరారు.ఇటీవల పార్లమెంట్ ఆమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో చట్టంగా మారిన సంగతి తెలిసిందే.
సెప్టెంబరు నెలలో చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే లక్ష్యంతో “నారీ శక్తి వందన్ అధినియం” పేరుతో మహిళా బిల్లును పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించాయి. రాష్ట్రపతి ఆమోదంతో బిల్లు చట్టంగా మారింది. అయితే ఈ చట్టం ఇప్పట్లో అమల్లోకి వచ్చే అవకాశం లేదు. జనాభా లెక్కలు, డీలిమిటేషన్ తర్వాత ఈ చట్టం అమల్లోకి వస్తుందని బిల్లుపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ లోక్ సభలో చెప్పారు.
ఈ చట్టం అమలులో జాప్యంపై కాంగ్రెస్ నాయకురాలు డాక్టర్ జయ తాహుకూర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చట్టం అమలుకు ఉన్న అడ్డంకులు చెల్లవని ప్రకటించి వెంటనే ఈ రిజర్వేషన్లను అమలు చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
Also Read: Telangana Assembly Elections 2023: హైదరాబాద్ లో భారీగా బంగారం, వెండి స్వాధీనం