Telangana Assembly Elections 2023: హైదరాబాద్ లో భారీగా బంగారం, వెండి స్వాధీనం
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పరిమితికి మించి నగదు ఆభరణాలు తీసుకెళ్ళరాదు. ఎన్నికల నియమం ప్రకారం కేవలం 50 వేలకు మించి నగదు తీసుకెళ్ళరాదు.
- Author : Praveen Aluthuru
Date : 16-10-2023 - 5:32 IST
Published By : Hashtagu Telugu Desk
Telangana Assembly Elections 2023: ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పరిమితికి మించి నగదు ఆభరణాలు తీసుకెళ్ళరాదు. ఎన్నికల నియమం ప్రకారం కేవలం 50 వేలకు మించి నగదు తీసుకెళ్ళరాదు. ఒకవేళ అత్యవసర పరిస్థితులు లేదా వ్యాపార లావాదేవీల్లో భాగం అయితే సరైన పత్రాలు చూపించాల్సి ఉంటుంది. మియాపూర్‌లో సరైన పత్రాలు లేకుండా తీసుకెళ్తున్న 27.5 కిలోల బంగారం, 15.6 కిలోల వెండి వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ ఆస్తులకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో సరైన ఆధారాలు లేకుండా నగదు, బంగారం, అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకునేందుకు విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు.
Also Read: Jatamansi : జటామాన్సి.. మూర్ఛకు చికిత్స చేసే మూలిక