HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Will Bilawals Ppp Imrans Pti Join Hands To Upset The Sharif Brothers

Bilawal Bhutto -Imran Khan : ఇమ్రాన్ కు మంచిరోజులు.. సపోర్ట్ గా ప్రధాన రాజకీయ పార్టీ !

Bilawal Bhutto -Imran Khan : పాకిస్తాన్ ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో అక్కడి రాజకీయాలు కొత్త మలుపు తీసుకుంటున్నాయి.

  • Author : Pasha Date : 29-08-2023 - 5:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bilawal Bhutto Imran Khan
Bilawal Bhutto Imran Khan

Bilawal Bhutto -Imran Khan : పాకిస్తాన్ ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో అక్కడి రాజకీయాలు కొత్త మలుపు తీసుకుంటున్నాయి. పాక్ పార్లమెంటు రద్దయ్యే వరకు నడిచిన సంకీర్ణ ప్రభుత్వంలో నవాజ్ షరీఫ్ కు చెందిన పాకిస్తాన్ ముస్లిం లీగ్ (నవాజ్) పార్టీ, బిలావల్ భుట్టోకు చెందిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ  భాగస్వాములుగా ఉండేవి.  ఈ రెండు పార్టీలు కలిసి ఏర్పాటుచేసిన కూటమిని పాకిస్తాన్ డెమొక్రటిక్ మూవ్ మెంట్ (పీడీఎం) అని పిలిచేవారు. అయితే వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో జరగనున్న పాక్ సార్వత్రిక ఎన్నికల్లో ‘పీడీఎం’ కూటమి కొనసాగే అవకాశాలు కనిపించడం లేదంటూ అక్కడి మీడియాలో కథనాలు వస్తున్నాయి.

Also read : Delhi Alliance : పొత్తుకు చంద్ర‌బాబు సై! ముంద‌స్తు సంకేతాలు!!

సాధారణంగా పార్లమెంటు రద్దయిన 90 రోజుల్లోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి కావాలి. కానీ ప్రస్తుతం ఎన్నికల కమిషన్, ఆపద్ధర్మ ప్రధాని కలిసి హడావుడిగా  పాకిస్తాన్ లోని లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను నిర్వహిస్తున్నాయి. ఇదంతా పూర్తి కావడానికి దాదాపు 6 నెలల టైం (180 రోజులు) పట్టనుంది. అంటే పాక్ రాజ్యాంగ నిబంధనల కంటే రెట్టింపు సమయాన్ని ఎన్నికల నిర్వహణ కోసం ఆపద్ధర్మ ప్రభుత్వం తీసుకుంటోంది. దీన్ని మొదటి నుంచీ బిలావల్ భుట్టోకు చెందిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) వ్యతిరేకిస్తోంది. ‘రాజ్యాంగం ప్రకారం సకాలంలో ఎలక్షన్ పూర్తి చేయాలి. ఆపద్ధర్మ ప్రభుత్వం అనవసరంగా మిగతా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోంది. ఇది సరికాదు’ అని  పీపీపీ పార్టీ నేతలు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.

Also read : LPG Gas Users : ఎల్పీజీ వినియోగదారులకు గుడ్‌ న్యూస్‌.. రూ.200 తగ్గింపు

అంతేకాదు.. ఇటీవల కరెంటు బిల్లులను పెద్దఎత్తున పెంచిన టైంలో ఇమ్రాన్ ఖాన్ కు చెందిన  పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ శ్రేణులతో కలిసి పీపీపీ క్యాడర్ నిరసనల్లో (Bilawal Bhutto -Imran Khan) పాల్గొంది. ఆపద్ధర్మ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పీపీపీ నేతలు నినాదాలు చేశారు. రోడ్లపై ధర్నాలు  చేశారు. టైర్లు తగలబెట్టి రాస్తారోకోలు నిర్వహించారు. ఈ పరిణామాలతో నవాజ్ షరీఫ్ కు చెందిన పాకిస్తాన్ ముస్లిం లీగ్ పార్టీ షాక్ కు గురైంది. ఇమ్రాన్ కు బిలావల్ భుట్టో చేరువయ్యారనే సంకేతాలను పంపేలా చోటుచేసుకున్న ఈ పరిణామాలు.. రానున్న రోజుల్లో పాక్ లో మారబోయే పొలిటికల్ సీన్ కు అద్దంపడుతున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే.. నవాజ్ షరీఫ్ పార్టీకి ఎదురుగాలి వీచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంధన ధరలు, నిత్యావసరాల ధరలు మండిపోతుండటంతో ఇప్పటికే పాక్ ప్రజలకు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం ఉంది. దీన్ని తమకు అడ్వాంటేజ్ గా మలుచుకొని పీపీపీ, పీటీఐల టీమ్ ఈజీగా అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయని  రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bilawal
  • Bilawal Bhutto -Imran Khan
  • imran khan
  • nawaz
  • Pakistan Elections
  • PPP
  • pti
  • Sharif Brothers
  • Shehbaz

Related News

'ISI has complete freedom, influences Parliament': Pakistan Minister Khawaja Asif makes sensational remarks.

ISIకి పూర్తి స్వేచ్ఛ.. పార్లమెంట్‌పై ప్రభావం.. ఇమ్రాన్ ఖాన్ పై పాకిస్థాన్ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు

పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ..దేశ రాజకీయ వ్యవస్థలో సైన్యం పాత్ర గురించి ఇప్పటివరకు చేసిన బహిరంగ ప్రకటనలలోకెల్లా అత్యంత నిష్కపటమైన అంగీకారాలలో ఒకటి చేశారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హయాంలో ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) పార్లమెంటరీ వ్యవహారాలను నేరుగా ప్రభావితం చేసిందని ఆయన ఆరోపించారు. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో మాట్లాడుతూ, దేశంలోని అగ్రశ్రేణి గూఢచార

    Latest News

    • Weather Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్.. భారీ వర్ష సూచనా

    • CM Chandrababu: ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. విద్యా రుణాలపై వడ్డీలో 4% రాయితీ

    • Gold Price: పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.?

    • Baba Ramdev: చంద్రబాబుపై బాబా రాందేవ్ ప్రశంసల వర్షం

    • Goat Milk: మేకపాలు ఎప్పుడూ తాగలేదా? ఈ విషయం తెలిస్తే వెంటనే తాగడం మొదలుపెడతారు!

    Trending News

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd