LPG Gas Users : ఎల్పీజీ వినియోగదారులకు గుడ్ న్యూస్.. రూ.200 తగ్గింపు
వంట గ్యాస్ (LPG Gas) వినియోగదారులకు కేంద్రం రక్షా బంధన్ గుడ్‌న్యూస్ చెప్పింది. గృహోపయోగ ఎల్‌పీజీ సిలిండర్ పై రూ.200 చొప్పున తగ్గించింది.
- Author : Maheswara Rao Nadella
Date : 29-08-2023 - 4:23 IST
Published By : Hashtagu Telugu Desk
Good News For LPG Gas Users : వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్రం రక్షా బంధన్ గుడ్‌న్యూస్ చెప్పింది. గృహోపయోగ ఎల్‌పీజీ సిలిండర్ పై రూ.200 చొప్పున తగ్గించింది. ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్‌లో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. తగ్గించిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. రక్షాబంధన్‌ను పురస్కరించుకుని ఈ రాయితీ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. అలాగే, ఉజ్వల పథకం కింద 75 లక్షల కొత్త వంట గ్యాస్ కనెక్షన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు.
మన ఇంట్లో వినియోగించే వంట గ్యాస్ సిలిండర్ (LPG Gas Cylinder) ధర ప్రస్తుతం దేశ రాజధాని దిల్లీలో రూ.1103గా ఉంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను పలుమార్లు సవరించిన ఆయిల్ కంపెనీలు.. గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్ ధరలను మాత్రం స్థిరంగా ఉంచుతున్నాయి. ఈ ఏడాది మార్చిలో ఒక్కో సిలిండర్ (LPG Cylinder) పై రూ.50 చొప్పున పెంచారు. 2016లో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. దారిద్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఈ పథకం కింద 5 కోట్ల వంట గ్యాస్ కనెక్షన్లు అందించే లక్ష్యంతో ఈ పథకం తీసుకొచ్చామని తెలిపారు.
Also Read: Massage Centers : బంజారాహిల్స్ మసాజ్ సెంటర్ లో పాడుపనులు..బట్టబయలు చేసిన పోలీసులు