Sexual Harassment: భర్త లైంగిక వేధింపులు తట్టుకోలేక…భార్య ఆత్మహత్య..!!
కట్టుకున్న భర్తనే బ్లాక్ మెయిల్, లైంగిక దాడులకు పాల్పడితే...ఆ బాధను ఏ మహిళా భరించలేదు.
- By hashtagu Published Date - 11:15 AM, Fri - 21 October 22

కట్టుకున్న భర్తనే బ్లాక్ మెయిల్, లైంగిక దాడులకు పాల్పడితే…ఆ బాధను ఏ మహిళా భరించలేదు. భర్త తనకు అండగా ఉంటాడనుకుంటే..నిత్యం వేధింపులకు గురి చేయడంతో…జీవితం మీద విరక్తి చెంది ఓ మహిళ అపార్ట్ మెంట్ 9వ అంతస్తు నుంచి దూకి సూసైడ్ చేసుకుంది. ఈ దారుణం కర్నాటకలోని వర్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉపాసన ఆమె భర్త రంజాన్ రావత్ ఉత్తరాధి నుంచి వలస వచ్చారు. దిశా అపార్ట్ మెంట్లో 9వ అంతస్తులో అద్దెకు ఉంటున్నారు. వీరికి 9ఏళ్ల క్రితం వివాహం జరిగింది.
వీరిద్దరూ ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. వీరికి సంతానం లేదు. ఆ విషయంలో తరచుగా గొడవపడుతుండేవారు. చివరికి డైవర్స్ వరకు వచ్చారు. తన జీవితంపై విరక్తి చెందిన ఉసాసన ఫ్లాట్ వరండా నుంచి కిందికి దూకింది. తీవ్రగాయాలతో అక్కడిక్కడే మరణించింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఉపాసన భర్త రంజన్ రావత్ ను అరెస్టు చేశారు.
ఆమె ఆత్మహత్యకు ముందు రాసిన సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో అసలు మ్యాటర్ బయటపడింది. నా భర్త నన్ను శారీరకంగా మానసికంగా వేధిస్తున్నాడు. అందుకే సూసైడ్ చేసుకుంటున్న. నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. అతన్ని శిక్షించండి అంటూ లేఖలో రాసింది.