HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Why The Threat Of Floods Whose Fault

Floods: ఎందుకీ వరదల ముప్పు..? ఎవరిది తప్పు..?

బుధవారం అరగంట పాటు కుండపోతగా కురిసిన వర్షంతో (Floods) హైదరాబాద్ మహానగరం అతలాకుతలమైంది. కేవలం 100 మిల్లీమీటర్ల వర్షపాతానికి నగరాలు మునిగిపోయే ప్రమాదం దాపురించింది.

  • Author : Hashtag U Date : 28-09-2023 - 1:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sikkim Flash Flood
Telangana Floods

By: డా. ప్రసాదమూర్తి

Floods: బుధవారం అరగంట పాటు కుండపోతగా కురిసిన వర్షంతో (Floods) హైదరాబాద్ మహానగరం అతలాకుతలమైంది. కేవలం 100 మిల్లీమీటర్ల వర్షపాతానికి నగరాలు మునిగిపోయే ప్రమాదం దాపురించింది. నిన్న సాయంత్రం సరిగ్గా 5 గంటలకు కురిసిన వర్షానికి హైదరాబాదులో కొన్ని ప్రాంతాలు దాదాపు మునిగిపోయినంత పనయింది. లంగర్ హౌస్ లో 94 ఎంఎం, శివరాంపల్లిలో 72.8 mm, షేక్పేట 61.8, మిగిలిన ప్రాంతాల్లో 40 నుంచి 50 ఎంఎం వరకు వర్షపాతం నమోదయింది. ఈ మాత్రం వర్షపాతం గతంలో పడలేదా, అంటే గతంలో కూడా ఇంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదైన సందర్భాలు ఉన్నాయి. కానీ రాను రాను కురుస్తున్న వర్షాల తీవ్రత కంటే అవి సృష్టించే ప్రమాద తీవ్రతే ఎక్కువగా కనిపిస్తుంది. సెప్టెంబర్ నెలలోనే ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రదేశాలలో తక్కువ కాలంలో ఎక్కువ వర్షపాతం నమోదయి అల్లకల్లోలం సృష్టించింది.

గత శనివారం నాగపూర్ లో అకస్మాత్తుగా కురిసిన వర్షం నాగపూర్ నగరాన్ని అల్లకల్లోలం చేసింది. కేవలం 100 mm వర్షపాతంతో నాగపూర్ పట్టణం నాలుగు వైపులా జలదిగ్బంధనానికి గురైంది. అనేకమంది ఇల్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. ఇంతే కాదు ఎంతో ఆస్తి నష్టం సంభవించింది. కేవలం నాగపూర్ కాదు ఉత్తరాదిన ఇటీవల కాలంలో విద్యుత్ వేగంతో కురిసిన వర్షాలు అనేక రాష్ట్రాల్లో ప్రళయం సృష్టించాయి. అస్సాం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో వర్షాలు సృష్టించిన భయోత్పాత పరిస్థితులు భవిష్యత్తును చాలా భీతావహంగా మారుస్తున్నాయి.

జూలై 9వ తేదీన ఢిల్లీలో 153 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. యమునా నది కోపోద్రిక్తంగా ఉప్పొంగి నగరాన్ని ముంచెత్తింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇటీవల వర్షాలకు లిబియా అల్లకల్లోలమైన వార్త మనల్ని భయపెడుతుంది. అయిదు వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. గ్రామాలకు గ్రామాలే నీట మునిగిపోయాయి. సౌతాఫ్రికాలో ఇదే నెలలో కురిసిన వర్షం మరో భయానక ఉదాహరణ. ఈ దేశం ఆదేశం అని లేదు. ప్రతి దేశంలో ప్రతి చోటా ఆకస్మిక వర్షాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

చరిత్రలో ఎన్నోసార్లు ఇంతకంటే భయానకమైన వర్షాలు కురిసిన ఉదంతాలు లేకపోలేదు. కానీ అప్పుడు నగరాలు మునిగిపోయిన సందర్భాలు తక్కువ. ఇప్పుడే ఇలా ఎందుకు జరుగుతుందనేది పెద్ద ప్రశ్న. దీనికి కారణంగా పలువురు వాతావరణ నిపుణులు, మేధావులు, శాస్త్రవేత్తలు అనేక విషయాలు చెబుతున్నారు. ముఖ్యంగా నదీ పరివాహ ప్రాంతాలను ఆవాస కేంద్రాలుగా మార్చి, నదులను ఒక పరిమిత ప్రాంతానికి రాను రాను కుదిస్తూ పోతున్నారు.

Also Read: MS Swaminathan Passed Away: హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూత

ఇది నదుల ఆగ్రహానికి ఒక ప్రధాన కారణం. యమునానది స్వేచ్ఛగా ప్రవహించే ప్రాంతాలను జనావాసాలుగా మార్చి కార్పొరేట్ కబ్జాలకు తలుపులు తెరిచిన దుష్పరిణామాల ఫలితంగా ఢిల్లీ వర్షాలను చూడాలని నిపుణులు చెప్తున్నారు. అలాగే ప్రతి నగరంలోనూ డ్రైనేజీ సిస్టం ఆధునిక అవసరాలకు సరిపడా వృద్ధి చేయకపోవడం మరో కారణం. చెరువులను పూడ్చి వేయడం, నగరంలో కురిసిన వాన వెలుపులకు వెళ్లే దారులు మూసివేయడం, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, విల్లాలు జనావాస ప్రాంతాల నిర్మాణం కోసం నదులను చెరువులను మాయం చేసే ముందు చూపులేని ఆధునికత ఇలాంటి జలప్రళయాలకు మరో కారణంగా నిపుణులు చెప్తున్నారు.

అంతేకాదు అడవులను అప్పనంగా కార్పొరేట్లకు అప్పగించి వాటిని మటుమాయం చేసి మరింత ప్రమాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. వేదాంతలాంటి కంపెనీలకు అడవులను ధారాదత్తం చేస్తున్న వారికి ఈ విషయాలు పట్టడం లేదు. అడవులు సమృద్ధిగా ఉంటే ఎంత వాన నీటినైనా అవి కడుపులో దాచుకుంటాయి. నగరాలలో నాలాలు, మురుగునీటి పారుదల వ్యవస్థ సవ్యంగా ఉంటే ఎంత వాన నీరైనా వెలుపలకు వెళ్ళిపోతుంది. ఇంత చిన్న విషయాలను కూడా ఎవరో స్వార్ధ ప్రయోజనాల కోసం విస్మరించడం వల్ల నగరాలు జలప్రళయాలకు నిలయాలుగా మారుతున్నాయి. 2015లో చెన్నైలో కురిసిన వానకి, కొద్దిపాటి వరదకి ఆ నగరం ఎంత అల్లకల్లోలం అయిందో మనకు గుర్తే ఉంటుంది.

అందుకే ప్రమాదం ముంచుకొచ్చాక పరిష్కార మార్గాలు ఆలోచించడం తెలివి తక్కువతనం. ప్రమాదాలు ముందుగానే ఊహించి వాటి పరిష్కారాలను ముందుగానే కనుగొని వాటి అమలు కోసం చిత్తశుద్ధితో ప్రభుత్వాలు పనిచేసినప్పుడే ఎలాంటి ప్రకృతి ప్రళయాలనైనా మనం తట్టుకోగలుగుతాం. కొన్ని ప్రళయాలు చెప్పి రావు‌. కానీ అనేక ప్రళయాలను మన ముందు చూపుతో ఆపగలం. మేమే విశ్వ నగర నిర్మాతలం అని గొప్పలు చెప్పుకునే వాళ్ళు, మేమే విశ్వ గురువులం అని డంబాలు పలికే వాళ్ళు కురిసే వాన నీటిని అదుపులో పెట్టి, నగరాలను కాపాడగలిగితే అంతే చాలు. లేకుంటే నదులు సహజంగానే ఆగ్రహిస్తాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • floods
  • heavy rains
  • Nagpur
  • rains
  • telangana
  • Threat Of Floods

Related News

Loan App Harassment

లోన్ యాప్ వేధింపులకు మరో ప్రాణం బలి

Loan App Harassment: లోన్ యాప్ వేధింపులకు మరో ప్రాణం పోయింది. కేవలం రూ.3 వేల కోసం ఫోన్లు చేస్తూ బెదిరింపులకు గురిచేయడంతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఇంట్లోనే ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడు. హైదరాబాద్ లోని చిక్కడపల్లిలో ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిక్కడపల్లిలో నివాసం ఉండే ప్రేమ్ కుమార్ గతంలో ఓ లోన్ యాప్ ద్వారా అప్పు తీసుకున్నాడు. రూ.3 వేల రుణం తిరిగి చెల్ల

  • Telangana Rtc Bus Stand

    ప్రయాణికులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో కొత్తగా 13 బస్‌స్టేషన్లు, 2 డిపోలు

  • Cm Revanth Municipal Electi

    మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్ సిద్ధం, తొలి బహిరంగ సభ అక్కడే !!

  • Budget Telugu States

    Budget 2026 – 27 : తెలుగు రాష్ట్రాలకు శుభవార్త తెలిపిన బడ్జెట్

  • Rare Earth Corridor

    Budget 2026 : గుడ్ న్యూస్ ! హైదరాబాద్ కు 3 హైస్పీడ్ రైళ్లు – నిర్మలా సీతారామన్ ప్రకటన

Latest News

  • టీ-20ల్లో అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్ ఎవరు? రిషబ్ పంత్ ఆసక్తికర సమాధానం!

  • కార్లలో క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్.. సౌకర్యవంతమే, కానీ జాగ్రత్తలు తప్పనిసరి!

  • చిగుళ్ల నుండి రక్తం వస్తుంటే ఆందోళన వద్దు.. ఈ చిట్కాలతో ఉపశమనం పొందండి!

  • బంగారం, వెండి ధరల్లో భారీ తగ్గుదల.. ఫిబ్రవరిలో మ‌రింత తగ్గే అవకాశం ఉందా?

  • బెన్ స్టోక్స్‌కు ఘోర ప్రమాదం.. ముఖంపై బలమైన గాయం!

Trending News

    • యూపీఎస్సీ సీఎస్ఈ, ఐఎఫ్ఎస్ 2026 నోటిఫికేషన్ విడుదల..

    • ఏపీ, తెలంగాణల్లో భయపెడుతున్న హెచ్ఐవీ మరణాలు

    • మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. MRP ధరలకే విక్రయం !

    • మరణానికి ముందు అతనికి ఫోన్ కాల్.. అజిత్ పవార్ చివరి మాటలు ఇవే !

    • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd