KTR : దేశం ఎందుకు క్షమాపణలు చెప్పాలి…చెప్పాల్సింది బీజేపీ-కేటీఆర్..!!
మహ్మద్ ప్రవక్తపై బీజేపీ అధికార ప్రతినిధి చేసిన వ్యాఖ్యలపై...తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్...కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
- By hashtagu Published Date - 10:41 AM, Mon - 6 June 22

మహ్మద్ ప్రవక్తపై బీజేపీ అధికార ప్రతినిధి చేసిన వ్యాఖ్యలపై…తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్…కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. బీజేపీ మతోన్మాదుల ద్వేషపూరిత ప్రసంగాలకు ఒక దేశంగా..భారతదేశంలో ఎందుకు క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు.
మీరు చేసిన నిర్వాకానికి దేశం పరువు పోయిందని…మనుషుల మధ్య విభేదాలు స్రుష్టిస్తూ…రాజకీయాలు చేయాలనుకుంటే ఇలాగే జరుగుతుందన్నారు. ట్విట్టర్ వేదికగా బీజేపీ, కేంద్ర సర్కార్ తీరుపై కేటీఆర్ మండిపడ్డారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మతోన్మాదులకు భారత దేశం ఎందుకు తలవంచాలని కేటీఆర్ ప్రశ్నించారు. బీజేపీ అధికార ప్రతినిధులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై గల్ఫ్ నుంచి ఎదురుదెబ్బ తగిలిందంటూ కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఇంతకన్నా సిగ్గుచేటు ఏముంటుందని మండిపడ్డారు. ఈ దేశానికి ముందు బీజేపీ క్షమాపణలు చెప్పాలంటూ కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఏ మతాన్ని ఉద్దేశించి అభ్యంతరకరమైన పదజాలం ఉపయోగించడం సరికాదు. ఈ విషయంలో బీజేపీ కఠినంగా వ్యవహారించాలి. వ్యాఖ్యలు చేసినవారిని సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవడం కాదు..కఠిన చట్టాల ప్రకారం జైలుకు పంపాలని కేటీఆర్ ట్వీట్ చేశారు.