IPL 2022: కోహ్లీ ఇప్పుడు మరింత డేంజర్
ఐపీఎల్ 15వ సీజన్ ఈ సారి అభిమానులకు మరింత కిక్కు ఇవ్వబోతోంది. రెండు కొత్త జట్లు ఎంట్రీతో టైటిల్ రేసు రసవత్తరంగా సాగనుంది. ఈ మెగా టోర్నీలో చెలరేగేందుకు స్టార్ ప్లేయర్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
- By Hashtag U Published Date - 10:15 AM, Fri - 18 March 22

ఐపీఎల్ 15వ సీజన్ ఈ సారి అభిమానులకు మరింత కిక్కు ఇవ్వబోతోంది. రెండు కొత్త జట్లు ఎంట్రీతో టైటిల్ రేసు రసవత్తరంగా సాగనుంది. ఈ మెగా టోర్నీలో చెలరేగేందుకు స్టార్ ప్లేయర్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపద్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ క్రికెటర్ గ్లెన్ మాక్స్ వెల్ మాజీ కెప్టెన్ కోహ్లి పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ ప్రస్తుతం కెప్టెన్సీ భారం లేకుండా ఫ్రీగా ఉన్నాడనీ, ఇది రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ప్రత్యర్థి జట్లకు చాలా ప్రమాదకరమనీ మాక్స్ వెల్ వ్యాఖ్యానించాడు.
గతేడాది ఐపీఎల్ తర్వాత కోహ్లీ ఆర్సీబీ కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. దీంతో ఈ సీజన్ కి కొత్త కెప్టెన్ గా బెంగుళూరు సఫారీ స్టార్ బ్యాటర్ డుప్లెసిస్ ను నియమించింది. కాగా కోహ్లీ కెప్టెన్ బాధ్యతను వదులుకోవడంతో అతనికి పెద్ద భారం దిగుపోయినట్టు తాను భావిస్తున్నాని మాక్స్ వెల్ చెప్పుకొచాడు. బ్యాటర్ గా కోహ్లీ మరింత స్వేచ్చ గా ఆడే అవకాశం ఉందన్నారు. బహుశా ఇది ప్రత్యర్థి జట్టుకు ప్రమాదకరమైన వార్త అని తెలిపాడు.
కోహ్లి నిజంగా ఎంజాయ్ చేసే దశలో ఉన్నాడని మ్యాక్స్‌వెల్ సంతోషం వ్యక్తం చేశాడు. కోహ్లీ మైదానంలో చాలా దూకుడుగా ఉంటాడనీ, ఎప్పుడూ గేమ్‌పై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నం చేస్తాడనీ చెప్పాడు. కోహ్లీ ఇప్పుడు ఫ్రీ గా బ్యాటింగ్ చేస్తాడని.. దీంతో భారీ స్కోర్లు ఖాయమని మాక్స్ వెల్ ధీమా వ్యక్తంచేశాడు. కెప్టెన్ గా ఉన్నప్పుడు అనేక బాధ్యతలు, ఇబ్బందులు ఉంటాయన్నాడు.ఈ ఐపీఎల్ లోనే కాకుండా తర్వాతి సిరీస్ లలో కూడా కోహ్లీ ఎలాంటి భారం లేకుండా బ్యాటింగ్ చేసే అవకాశం ఉందనీ మాక్స్ వెల్ చెప్పుకొచ్చాడు. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2022 సీజన్ మార్చి 26 నుంచి మొదలు కానుంది.