Biden Vs Putin : హమాస్, పుతిన్ పై బైడెన్ సంచలన కామెంట్స్.. ఏమన్నారు ?
Biden Vs Putin : ఓ వైపు ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధం, మరోవైపు ఉక్రెయిన్ - రష్యా యుద్ధం జరుగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
- By Pasha Published Date - 09:49 AM, Fri - 20 October 23
Biden Vs Putin : ఓ వైపు ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం, మరోవైపు ఉక్రెయిన్ – రష్యా యుద్ధం జరుగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘హమాస్’ వంటి ఉగ్రవాదులను, ‘పుతిన్’ వంటి నిరంకుశులను గెలవనిచ్చేది లేదని ఆయన స్పష్టం చేశారు. ‘‘రష్యా దాడికి వ్యతిరేకంగా ఉక్రెయిన్ స్పందిస్తోంది. మేం సహకరిస్తున్నాం. హమాస్ దాడికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ స్పందిస్తోంది. మేం సహకరిస్తున్నాం’’ అని ఆయన వెల్లడించారు. యుద్ధంలో ఇజ్రాయెల్ కు సపోర్ట్ చేస్తూనే.. పాలస్తీనియన్ల మానవ హక్కులను కూడా తాము గౌరవిస్తామని చెప్పారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇజ్రాయెల్ కు అండగా నిలిచేందుకు.. గత రెండు వారాలలో అమెరికా రెండు విమాన వాహక యుద్ధ నౌకలు, దాదాపు 2,000 మంది నౌకాదళ సిబ్బంది, అత్యాధునిక యుద్ధ విమానాలు, మిస్సైళ్లను ఇజ్రాయెల్ తీరానికి పంపింది. దీంతో స్వయంగా అమెరికా ప్రెసిడెంట్ బైడెన్, విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ లు ఇజ్రాయెల్ లో పర్యటించి నైతిక మద్దతు ప్రకటించారు. ఈనేపథ్యంలో ఇరాక్, సిరియాలలోని అమెరికన్ దళాలపై ఇరాన్-మద్దతుగల మిలిటెంట్ గ్రూపులు డ్రోన్ దాడులు, మిస్సైల్ దాడులు చేశాయి. ఇప్పటివరకు ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో దాదాపు 3,785 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 12,493 మంది గాజా ప్రజలు గాయపడ్డారు. కాగా, హమాస్ స్థావరాలను ధ్వంసం చేసే లక్ష్యంతో గాజా స్ట్రిప్‌లోకి ప్రవేశించేందుకు ఇజ్రాయెల్ ఆర్మీ రెడీ అవుతోంది. ప్రస్తుతం దాదాపు 3.50 లక్షల మంది ఇజ్రాయెల్ సైనికులు, వందలాది యుద్ధ ట్యాంకులు గాజా బార్డర్ లో మోహరించి (Biden Vs Putin) ఉన్నాయి.