Breast Cancer Vs Mother Milk : రొమ్ము క్యాన్సర్ ఉన్న బాలింతలు పిల్లలకు పాలు ఇవ్వొచ్చా ?
Breast Cancer Vs Mother Milk : రొమ్ము క్యాన్సర్‌తో ఇబ్బంది పడే మహిళలు తమ పిల్లలకు పాలు ఇవ్వొచ్చా? ఇవ్వొద్దా ?
- By Pasha Published Date - 09:20 AM, Fri - 20 October 23

Breast Cancer Vs Mother Milk : రొమ్ము క్యాన్సర్‌తో ఇబ్బంది పడే మహిళలు తమ పిల్లలకు పాలు ఇవ్వొచ్చా? ఇవ్వొద్దా ? ఒకవేళ పిల్లలకు పాలు ఇస్తే ఏమవుతుంది ? అనే డౌట్స్ చాలామందికి వస్తుంటాయి. వీటికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) సూటిగా ఇస్తున్న ఆన్సర్ ఏమిటంటే.. ‘రొమ్ము క్యాన్సర్ కారణంగా కీమోథెరపీ చేయించుకుంటున్న బాలింతలు తమ పిల్లలకు పాలు ఇవ్వకపోవడమే మంచిది’. ఒకవేళ కీమో థెరపీ జరుగుతున్న టైంలో పిల్లలకు తల్లి పాలు ఇస్తే వారి శరీరంలోకి మందులు ప్రవేశిస్తాయని, వాటి ఎఫెక్ట్ తో పిల్లలకు ఇన్ఫెక్షన్లు వస్తాయని డబ్ల్యూహెచ్వో అంటోంది. దీనివల్ల రోగ నిరోధక శక్తి కూడా క్షీణిస్తుందని తెలిపింది. ఒకవేళ ప్రెగ్నెన్సీ టైంలోనే రొమ్ము క్యాన్సర్ ను గుర్తిస్తే.. వైద్యుల సూచనల ప్రకారం గర్భిణులు నడుచుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.
We’re now on WhatsApp. Click to Join.
రొమ్ము క్యాన్సర్ చికిత్స సక్సెస్ అయిన తర్వాత పిల్లలకు పాలు ఇవ్వొచ్చా అనే డౌట్ వస్తుంటుంది. హార్మోన్ థెరపీ లేదా ఓరల్ కీమోథెరపీ చేసుకున్న బాలింతలు తమ పిల్లలకు పాలు ఇవ్వొచ్చు. అయితే ఈ చికిత్సల వల్ల తల్లి పాల ఉత్పత్తిపై ఎఫెక్ట్ పడుతుందని గుర్తుంచుకోవాలి. చాలా సందర్భాల్లో రేడియేషన్‌కు గురైన రొమ్ము నుంచి పాల ఉత్పత్తి జరగకపోవచ్చు. అయితే క్యాన్సర్ ఎఫెక్ట్ లేని మరో రొమ్ముతో బిడ్డకు పాలు ఇవ్వొచ్చు. క్యాన్సర్ చికిత్స పూర్తయిన కనీసం మూడు నెలల తర్వాత పిల్లలకు పాలు ఇవ్వొచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది పాల నాళాలు లేదా పాలను ఉత్పత్తి చేసే లోబుల్స్‌లో (Breast Cancer Vs Mother Milk) కూడా వస్తుంటుందని తెలిపారు.
Also Read: E Challan Scam : ఏపీలో ఈ – చలానా స్కామ్..ఎన్ని కోట్లు కొట్టేసారో తెలుసా..?
గమనిక: ఈ వార్తలోని వివరాలను ఎక్స్ పర్ట్స్ అభిప్రాయం, విశ్లేషణ, మీడియా నివేదికల ప్రకారం అందించాం. ఇది కేవలం మీ అవగాహన కోసమే. మీ నిర్ణయానికి పూర్తి బాధ్యత మీదే.