Trains Cancelled: విజయనగర్ రైలు ప్రమాదం ఎఫెక్ట్, 33 రైళ్లు రద్దు
కోరమండల్ రైలు ప్రమాద ఘటనను మరువకముందే ఏపీలో విజయనగరంలో రెండు రైళ్లు ఢీకొన్న ప్రమాదం చోటుచేసుకోవడం తీవ్ర విషాదం రేపింది.
- By Balu J Published Date - 12:53 PM, Mon - 30 October 23
Trains Cancelled: కోరమండల్ రైలు ప్రమాద ఘటనను మరువకముందే ఏపీలో విజయనగరంలో రెండు రైళ్లు ఢీకొన్న ప్రమాదం చోటుచేసుకోవడం తీవ్ర విషాదం రేపింది. ఈ ఘటనలో 14 మంది చనిపోయారు. కేసులు సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం కూడా ఉంది. అయితే ఈ ప్రమాదం కారణంగా పలు రైలు రద్దయ్యయాయి. ఇప్పటి వరకు 33 రైళ్లను రద్దు చేయగా, మరో ఆరు రైళ్లను రీషెడ్యూల్ చేసినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు సోమవారం తెలిపారు. వాల్తేర్ పరిధిలోని కంటకపల్లె – అలమనాడ స్టేషన్‌ల మధ్య రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్న ప్రమాదం తర్వాత మొత్తం 33 రైళ్లను రద్దు చేశామని, 24 రైళ్లను దారి మళ్లించామని, 11 పాక్షికంగా రద్దు చేసినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే, భువనేశ్వర్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి బిశ్వజిత్ సాహు మీడియాకు చెప్పారు. ఇందులో ఈ ఉదయం మూడు రైళ్లు రద్దు చేయబడ్డాయి.
రద్దు అయిన రైళ్ల వివరాలివే
30 అక్టోబర్ – రైలు నం. 08527 – రాయ్‌పూర్-విశాఖపట్నం ప్యాసింజర్
30 అక్టోబర్ – విశాఖపట్నం నుండి – రైలు నం. 08528 – విశాఖపట్నం-రాయ్‌పూర్ ప్యాసింజర్
30 అక్టోబర్ – రాయ్‌పూర్ నుండి – రైలు నం. 08527 – రాయ్‌పూర్-విశాఖపట్నం ప్యాసింజర్
30 అక్టోబర్ – విశాఖపట్నం నుండి – రైలు నం. 08528 – విశాఖపట్నం-రాయ్‌పూర్ ప్యాసింజర్
30 అక్టోబర్ – పలాస నుండి – పలాస-విశాఖపట్నం స్పెషల్
30 అక్టోబర్ – పారాదీప్ నుండి – పారాదీప్-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్
30 అక్టోబర్ – కోర్బా నుండి – కోర్బా-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్
30 అక్టోబర్ – రాయగడ నుండి – రాయగడ-విశాఖపట్నం ప్యాసింజర్
30 అక్టోబర్ – విజయనగరం నుండి – విజయనగరం-విశాఖపట్నం స్పెషల్
30 అక్టోబర్ – విశాఖపట్నం నుండి – విశాఖపట్నం-గుణపూర్ స్పెషల్