Surinder Shinda: పంజాబీ గాయకుడు సురీందర్ షిండా మృతి
ప్రఖ్యాత పంజాబీ గాయకుడు సురీందర్ షిండా మృతి చెందారు. కొంతకాలంగా సురీందర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
- Author : Praveen Aluthuru
Date : 26-07-2023 - 12:46 IST
Published By : Hashtagu Telugu Desk
Surinder Shinda: ప్రఖ్యాత పంజాబీ గాయకుడు సురీందర్ షిండా మృతి చెందారు. కొంతకాలంగా సురీందర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవల ఆయనకు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆపరేషన్ జరగగా, ఇన్ఫెక్షన్ సోకింది. దీంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడేవారు. ఇటీవల సమస్య మరింత ఎక్కువ అవ్వడంతో అతనిని లుధియానాలోని డిఎంసి హాస్పిటల్‌లో చేర్చారు. 20 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు జూలై 26న కన్నుమూశారు. లూథియానాలోని డిఎంసి ఆసుపత్రిలో ఉదయం 7.30 గంటలకు తుది శ్వాస విడిచారు.అతని వయసు 64 సంవత్సరాలు. సురీందర్ షిండా మరణవార్త పంజాబీ చిత్ర పరిశ్రమలో విషాదాన్ని నింపింది. జస్వంత్ భన్వ్రా వద్ద గానం నేర్చుకున్నాడు. తన ప్రతి పాటలో క్లాసికల్ టచ్‌ను కొనసాగించాడు. సురీందర్ షిండా మే 20, 1959లో జన్మించాడు.
Also Read: Pawan Kalyan: కోలీవుడ్ పెద్దలకు పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్.. కారణమిదే!