MM Keeravani : సంగీత దర్శకుడు ఎమ్‌ఎమ్ కీరవాణికి మాతృ వియోగం
ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి (Rajamouli) నివాసానికి తరలించనున్నారు.
- Author : Maheswara Rao Nadella
Date : 14-12-2022 - 5:21 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్‌ఎమ్ కీరవాణి (MM Keeravani) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. బుధవారం(డిసెంబర్ 14న ఆయన తల్లి మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను మూడు రోజుల క్రితం కుటుంబ సభ్యులు కిమ్స్ ఆస్పత్రిలో చెర్పించారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం క్షీణించడంతో నేడు తుదిశ్వాస విడిచారు. ఆమె భౌతికకాయాన్ని ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి (Rajamouli) నివాసానికి తరలించనున్నారు. ఆమె మృతితో కీరవాణి ఇంట విషాదచాయలు అలుముకున్నాయి. తల్లి మృతితో తీవ్ర దు:ఖంలో మునిగిపోయారు కీరవాణి. టాలీవుడ్ సినీ ప్రముఖులు, నటీనటులు ఆమె మృతికి సంతాపం తెలుపుతున్నారు.
Also Read: Ukraine – Russia : ఉక్రెయిన్ రాజధానిలో పేలుళ్లు..13 డ్రోన్ల కూల్చివేత